సర్పంచ్ ఎన్నికల వేడి: ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, లిక్కర్, బిర్యానీ వేట!
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ముందు రాజకీయ వేడి పెరిగింది. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, లిక్కర్, బిర్యానీల పంపిణీ జోరందుకుంది. గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఉధృతం.
* రేపే ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి
* ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు లిక్కర్
* ఇంకొన్ని గంటల్లో మొదటి విడత పలింగ్
* ఓటర్లకు 1000 నుంచి 4000 మంచి లయిస్తున్నారంట
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : రేపు ఉదయం 7 గంటలకు తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుండటంతో గ్రామాల్లో రాజకీయ జోష్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సర్పంచ్ అభ్యర్థులు చివరి నిమిషం వరకూ ఓటర్లను ఒప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైన వెంటనే ఓటు కోసం నోట్లు పంచే దందా మళ్లీ తెరమీదకు వచ్చింది. గ్రామాల్లో రాత్రికి రాత్రే గుప్తంగా ఇళ్లకు వెళ్లి ఓటర్ల చేతుల్లో రూ. 1,000 నుంచి రూ. 4,000 వరకు పెట్టి తమకు అనుకూలంగా ఓటేయాలని మొరపెడుతున్నట్లు తెలుస్తోంది.
నగదు మాత్రమే కాదు… లిక్కర్ క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీ కూడా కొన్ని చోట్ల బహిరంగంగానే జరుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. రేపటి పోలింగ్ ముందు తమ ఓటు బ్యాంకును ఏ విధంగానైనా పటిష్టం చేసుకోవాలన్న దూకుడు అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తున్నది fourth line news . మరి సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిందో ఏ పార్టీ అభ్యర్థులు కలుస్తారో మీ అభిప్రాయాన్ని తెలపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0