సముద్ర మట్టం పెరుగుదలతో ఏపీలో 282 తీర గ్రామాలకు ముంపు ముప్పు
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు సముద్ర మట్టం పెరుగుదలతో తీవ్రమైన ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. అధికారుల అంచనా ప్రకారం 282 గ్రామాలు ప్రమాదంలో ఉండగా, 10 లక్షల మందిని తరలించే అవకాశముంది. ప్రభుత్వం తీరరక్షణ చర్యలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు మరోసారి ముంపు భయాన్ని ఎదుర్కోనున్నాయి.
తుఫాన్లు, వరదలు, వాతావరణ మార్పులు తరచూ చెలరేగే ప్రాంతాల్లో ఏపీ కూడా ఒకటి.
తాజాగా నిర్వహించిన అధ్యయనంలో పర్యావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,
సముద్ర మట్టం పెరుగుదలతో రాష్ట్రంలోని 282 తీర గ్రామాలు మునిగే ప్రమాదంలో ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇక, ఈ పరిస్థితుల్లో సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర తీరరేఖలో దాదాపు 32% భాగం ఇప్పటికే సముద్రపు తరంగాల దెబ్బకు కోతకు గురవుతోందని సమాచారం. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం తీరరక్షణ గోడలు, మానవవనరుల పునరావాస ప్రణాళికలపై దృష్టి సారించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0