సల్మాన్ ఖాన్ బర్త్‌డే… చిరంజీవి మాటలు వింటే ఫ్యాన్స్ ఫిదా

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు పన్వేల్ ఫామ్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి. చిరంజీవి భావోద్వేగపూరిత పోస్ట్, ఎంఎస్ ధోనీ రాక మరియు మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇక్కడ చూడండి.

flnfln
Dec 27, 2025 - 15:58
Dec 27, 2025 - 19:03
 0  3
సల్మాన్ ఖాన్ బర్త్‌డే… చిరంజీవి మాటలు వింటే ఫ్యాన్స్ ఫిదా

1. బాలీవుడ్ స్టార్స్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్ డే 
2. 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న సల్మాన్ ఖాన్. 
3.  ధోని, సంజయ్ దత్, టబు, కరిష్మా కపూర్ తదితర సినీ, క్రీడా ప్రముఖులు. 
4. మీడియా మిత్రులతో సరదాగా మాటలు 
5. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే విషెస్. 
6. వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్. 
7. పూర్తి వివరాలు కోసం కింద ఉన్న సమాచారాన్ని చదవండి.

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డిసెంబరు 27న తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సల్మాన్‌కు ఈ పుట్టినరోజు అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య ప్రత్యేకంగా మారింది. దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ప్రత్యేక సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. సల్మాన్‌ను తన “ప్రియమైన సోదరుడు”గా పేర్కొన్న చిరంజీవి, ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, మరెన్నో విజయాలు కలగాలని ఆకాంక్షించారు. సల్మాన్ కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సహచర నటులకు కూడా స్ఫూర్తిగా నిలిచారని చిరంజీవి ప్రశంసించారు. ఈ పోస్టు అభిమానుల మధ్య విపరీతమైన స్పందన పొందింది.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సల్మాన్ తన పుట్టినరోజును ముంబై సమీపంలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించినప్పటికీ, బాలీవుడ్‌లోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు రావడం విశేషంగా నిలిచింది. ఆయనతో పాటు సంజయ్ దత్, టబు, కరిష్మా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, హ్యూమా ఖురేషి తదితర సినీ ప్రముఖులు పాల్గొని సల్మాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా సల్మాన్ తన మేనకోడలు అయత్‌తో కలిసి కేక్ కట్ చేయడం నిలిచింది. అయత్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులతో సల్మాన్ ఎంతో ఆనందంగా సమయం గడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి. తన కోసం ఎదురుచూస్తున్న మీడియా మిత్రులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. మీడియాతో చాలా సన్నిహితంగా మాట్లాడుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటిలాగానే సల్మాన్ ఖాన్ ప్రవక్తలతో అందరినీ ఆకట్టుకున్నాడు. 

ఈ సందర్భంగా సల్మానుకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు వారి యొక్క అభిప్రాయాలు పోస్ట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతమైతే సల్మాన్ ఖాన్ పుట్టుక రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులంతా ఆ పోస్టులను ఆ వీడియోలను చూసి ఇంకా సంతోషపడుతున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా అదే ఎనర్జీ, అదే ఉత్సాహముతో సల్మాన్ ఖాన్ ఎన్నో సినిమాలు తీయాలి అని అభిమానులు , సినీ నటులు, నటిని మనులు తెలియజేస్తున్నారు. 

మరి సల్మాన్ ఖాన్ సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.  ఫోర్త్ లైన్ న్యూస్ కథనం 

.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.