ఆకాశంలో గిర్రున తిరుగుతూ కూలిన రష్యా హెలికాప్టర్
రష్యాలో Ka-226 హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి, ఇద్దరు గాయపడ్డారు. తోక విరిగిపోవడంతో హెలికాప్టర్ గాల్లో తిరుగుతూ కూలిపోయింది. వీడియో వైరల్ అవుతోంది.
రష్యాలో ఒక దారుణమైన హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని కాస్పియన్ సముద్ర తీరంలో Ka-226 హెలికాప్టర్ కుప్పకూలింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు క్లిజియార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
హెలికాప్టర్ తోక భాగం విరిగిపోవడంతో నియంత్రణ కోల్పోయి, ఆకాశంలో గిర్రున తిరుగుతూ ఒక్కసారిగా నేలకూలి పేలిపోయిందని సాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0