రష్యా అతలాకుతలం! 24 మంది మృతి.. చిన్నారి బలి.. ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?"
కొత్త సంవత్సర వేడుకల సమయంలో రష్యా నియంత్రణలో ఉన్న ఖేర్సన్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో ఒక చిన్నారితో సహా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
1. కొత్త సంవత్సరం అయినా కూడా యుద్ధం
2. 24 మంది మృతి. ప్రతిలో చిన్నారి
3. 50 మందికి పైగా గాయాలు.
4. దాడులు ఎవరు చేశారో తెలిస్తే షాక్ అయిపోతారు.
మళ్లీ రష్యా ఉక్రెన్ మధ్య యుద్ధం మొదలైనట్టు తెలుస్తుంది.కొత్త సంవత్సరంలో కూడా మొదటి రోజున యుద్ధం జరిగినట్టు సమాచారం వస్తుంది. రష్యా నియంత్రణలో ఉన్న ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ పట్టణంలో జరిగిన డ్రోన్ దాడులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. నూతన సంవత్సర సంబరాల సందర్భంగా ప్రజలు అందరూ హోటల్, కేఫ్‌లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో 24 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు ఖేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దాడి పూర్తిగా పౌరులనే లక్ష్యంగా చేసిందని, నిప్పు అంటుకునే రసాయనాలను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఇది మానవత్వానికి విరుద్ధమైన చర్యగా ఆయన ఖండించారు.
దాడి అనంతరం గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు తెలిపారు. భద్రతా కారణాల వల్ల ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు.
అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు. యుద్ధ పరిస్థితుల్లో ఇరు పక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ దాడిపై స్వతంత్రంగా నిర్ధారణ జరగాల్సి ఉందని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించాల్సిన సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటన జరగడం పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరుల భద్రతకు ముప్పు కలిగించే దాడులను నిలిపివేసి, యుద్ధానికి ముగింపు పలకాలని ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు పిలుపునిస్తున్నాయి.
నిజంగా ఈ యుద్ధం ఆగాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది. ఇప్పటికే కొన్ని వందలాదిమంది ప్రాణాలు పోయాయి. అయినా కూడా ఇరుదేశాలు ఎక్కడ కూడా తగ్గకుండా యుద్ధాలు చేయడము అనేది ప్రజలకు నచ్చట్లేదు. నిజంగా ఈ యుద్ధం ఆగుతోందా? లేకపోతే కొనసాగిద్దా. ట్రంప్ అసలుకి ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0