ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రమాదం – ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు
ఔశాపూర్ వద్ద జనగామ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతుండటంతో ప్రయాణికులలో భయాందోళన నెలకొంది. తాజాగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపుకు దూసుకెళ్లింది. కారును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔశాపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జనగామ నుండి ఉప్పల్ వైపు 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఔశాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. ముందున్న కారును ఓవర్‌టేక్ చేయాలనే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్‌ను ఢీకొని అవతలి వైపుకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో ఎవరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడి ఊపిరి పీల్చుకున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0