రామ్ గోపాల్ వర్మ: ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రిలో క్రిమినల్ కేసు
రామ్ గోపాల్ వర్మ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజమండ్రిలో న్యాయవాది మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేసడంతో వర్మతో పాటు ఓ టీవీ యాంకర్‌పై కేసు నమోదు. పోలీసులు BNS చట్టం కింద విచారణ ప్రారంభించారు.
Main headlines ;
-
వివాదాస్పద ఇంటర్వ్యూ:
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. -
ఫిర్యాదు దాఖలు:
రాజమండ్రికి చెందిన న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, వర్మ వ్యాఖ్యలపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
అవమానకర వ్యాఖ్యల ఆరోపణ:
వర్మ వ్యాఖ్యలు హిందూ మత గ్రంథాలు, దేవతలు, భారత సైన్యం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
యాంకర్‌పైన కూడా ఆరోపణలు:
ఇంటర్వ్యూకు యాంకర్‌గా హాజరైన మహిళా జర్నలిస్ట్ కూడా వర్మను కావాలనే వివాదాస్పద ప్రశ్నలు అడిగి ప్రేరేపించారని ఆరోపించారు. -
కేసు నమోదు:
ఫిర్యాదును స్వీకరించిన త్రీ టౌన్ పోలీసులు, వర్మతో పాటు యాంకర్‌పైనా క్రైమ్ నంబర్ 487/2025 కింద BNS చట్టంలోని సెక్షన్లు 196(1), 197(1), 353, 354, 299 R/w (3) ప్రకారం కేసు నమోదు చేశారు. -
గతంలోనూ కేసులు:
ఇది మొదటిసారి కాదు – వర్మపై గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లోనూ పలు కేసులు నమోదయ్యాయి.
పూర్తి వివరాల్లోనికి వస్తే ;
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద పరిణామాల్లో ఇరుక్కొన్నారు. ఇటీవల ఒక టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు తలెత్తిన దుమారానికి కారణంగా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వర్మతో పాటు ఆ ఇంటర్వ్యూకు హాజరైన యాంకర్‌పై కూడా రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు.
వర్మ మాటలు హిందూ మత గ్రంథాలు, దేవతలు, భారత సైన్యం, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కోణంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకెళ్లితే... రాజమండ్రికి చెందిన న్యాయవాది మరియు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.
ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు పెరిగేలా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిళా యాంకర్ కూడా వర్మను కావాలనే వివాదాస్పద ప్రశ్నలు అడిగి ఆయనను ప్రేరేపించారని ఆరోపించారు.
ఇలాంటి వ్యాఖ్యల వెనుక విదేశీ ఉగ్రవాదుల పాత్ర ఉండే అవకాశం కూడా ఉందని మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు.
మేడా శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదును త్రీ టౌన్ పోలీసులు స్వీకరించారు. ఈ క్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు ఇంటర్వ్యూకు యాంకర్‌గా ఉన్న మహిళపై క్రైమ్ నంబర్ 487/2025 కింద కేసు నమోదు చేశారు.
BNS చట్టంలోని సెక్షన్లు 196(1), 197(1), 353, 354, 299 R/w (3) కింద కేసులు పెట్టి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.
గతంలో కూడా వర్మపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదైన ఉదంతాలు ఉన్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0