రాజస్థాన్ బస్సు దుర్ఘటనలో 20 మంది మృతి – బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
రాజస్థాన్‌లో బస్సు దగ్ధమై 20 మంది మృతిచెందగా, ప్రధాని మోదీ బాధితులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల పరిహారం ప్రకటించారు.
Main headlines :
1. రాజస్థాన్‌లోని జైసల్మేర్–జోధ్‌పూర్ రహదారిపై బస్సు దగ్ధమై ఘోర ప్రమాదం జరిగింది.
2. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
3. ప్రమాదంలో 16 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు అని అధికారులు తెలిపారు.
4. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
5. మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు
పూర్తి వివరాల్లోనికి వస్తే :
రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాలు బలిగొంది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వైపు వెళ్తున్న ఒక ప్రయాణ బస్సు అగ్నికి ఆహుతైన ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రధాని సహాయనిధి (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు ₹2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు ₹50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0