రాజాసాబ్ ప్రీమియర్స్… ఇంకెంత వెయిటింగ్?

‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌పై తెలంగాణలో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి జీవో కోసం ఎదురుచూపులు. బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? తాజా అప్డేట్ ఇదే.

Jan 8, 2026 - 21:05
 0  4
రాజాసాబ్ ప్రీమియర్స్… ఇంకెంత వెయిటింగ్?

1. TG ప్రభుత్వం ప్రభాస్ సినిమాకి గ్రీస్ సిగ్నల్ ఇస్తుందా! 

2. అభిమానుల్లో ఆరాటం మొదలైంది ఇప్పటికే? 

3. టికెట్లు బుక్ చేసుకోవాలి అంటూ అభిమానులు ఆందోళన? 

4. ఈ నైట్ కి ప్రభుత్వం గ్రీస్ సిగ్నల్?

fourth line news : హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రాజాసాబ్’ ప్రీమియర్స్ విషయంలో తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో, TG ఫ్యాన్స్ మాత్రం ప్రభుత్వ అనుమతిపై ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం నుంచి అధికారిక జీవో విడుదల కాకపోవడంతో థియేటర్ యాజమాన్యాలు బుకింగ్స్ ఓపెన్ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో BookMyShow, Paytm, Insider వంటి టికెట్ ప్లాట్‌ఫామ్స్‌లో అభిమానులు పదే పదే చెక్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో #RajaSaabPremieres, #RajaSaabTGPremiers హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతుండగా, “ఇంకెంత వెయిటింగ్?”, “ఒక్క అప్డేట్ ఇవ్వండి” అంటూ మేకర్స్‌ను అభిమానులు ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి లోపే ‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌కు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఒకవేళ అనుమతి వస్తే, వెంటనే స్పెషల్ షోలు మరియు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అన్ని అనుకూలంగా జరిగితే, TGలో కూడా ఫస్ట్ షో నుంచే ఫుల్ హౌస్ కలెక్షన్లతో ‘రాజాసాబ్’ దూసుకుపోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఎంతగానో వేచి చూస్తున్నా సినిమాకు ప్రీమియం షో ఇస్తారా లేకపోతే ఆపేస్తారా అనేది ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది. ఎందుకు ఇంకా ప్రీమియం షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు అని కొంత ఆందోళన కూడా కనిపిస్తుంది. మరి రాత్రికి మరి ప్రభుత్వం స్క్రీన్ సిగ్నల్ ఇచ్చిదో లేదో మరి కాసేపట్లో తెలుస్తుంది. కానీ సినిమా మాత్రం ఏ లెవెల్ లో ఉంటుందో ఇప్పటికే, పోస్టర్ల ద్వారా, ప్రోమోల ద్వారా తెలుస్తుంది. 

ఈ సినిమాలో ప్రభాస్ టైమింగ్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు డైలాగులు కావచ్చు, ఇప్పటికే అభిమానుల్లో కొత్త ఉత్సవాన్ని పుట్టించాయి. మరి సినిమా విడుదలైనక ఏ విధంగా ఈ సినిమా ఉండబోతుంది సంక్రాంతికి కుటుంబాలను సహా సంతోష పరుస్తదా లేదో చూడాలి. 

*ప్రభాస్ సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0