‘రాజకీయాలకు గుడ్‌బై?’ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై హాట్ టాపిక్
బిహార్ ఎన్నికల నడుమ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. జేడీయూ 25 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన పీకే వ్యాఖ్యపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.
బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కలు సాగుతున్న వేళ, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
జేడీయూ 25 కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే, తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని పీకే పబ్లిక్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం, జేడీయూ 25 సీట్ల మార్క్‌ను దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పీకే చేసిన ‘శపథం’ మరోసారి హాట్ టాపిక్ అయింది.
ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొనడం కూడా కొత్త చర్చలకు తావిస్తోంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0