మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన ..! ప్రజల సమస్యలను...?
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకువస్తోంది. ప్రజావాణి రెండో వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన కీలక వ్యాఖ్యలు.
* ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను
* ఉపముఖ్యమంత్రి కీలకమైన వ్యాఖ్యలు
* ప్రజావాణి విజయవంతం చేసిన మీకు
* సమస్యల పరిష్కారం కోసం కొత్త సాఫ్ట్వేర్ను తెస్తున్నాం
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news కథనం : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుండి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక కొత్త రూపాన్ని దాలుస్తున్నాము. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి అన్ని శాఖలతో సమన్యాయం చేస్తున్నాము అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
బేగంపేటలోని ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ప్రజావాణి రెండో వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు ప్రజావాణి ఇన్చార్జిలో పాల్గొన్నారు. అలాగే పలువురు లబ్దదారులు తమ యొక్క అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మని ఆయన వెల్లడించారు. ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లలోపు 74% ఫిర్యాదులను పరిష్కరించాము అని ఆయన వెల్లడించారు. చాలామంది ఎన్నో దుష్ట ప్రచారాలు చేసిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తాము అని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది.
ఉప ముఖ్యమంత్రి అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా మా ప్రభుత్వం మరింత ముందుకు వెళుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేసి ప్రజల అభిమానాన్ని పొందుకుంటాము. చివరిగా ప్రజావాణిని విజయవంతం చేసిన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0