pawan-kalyan నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ గౌరవం
దీపావళి సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు గౌరవంగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రత్యేక ట్రిబ్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఓజీ’ విజయంతో పవర్ స్టార్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.
ఈ వార్తకు సంబంధించిన 6 ముఖ్యమైన పాయింట్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రభావం కేవలం థియేటర్ల వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా కొనసాగుతోందని మరోసారి నిరూపితమైంది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకమైన గౌరవాన్ని ప్రకటించింది. దీపావళి సందర్బంగా ఆయనకు అంకితంగా ఒక ఆర్టిస్టిక్ ట్రిబ్యూట్ వీడియోను విడుదల చేసింది. ఒక గ్లోబల్ సంస్థ భారతీయ నటుడికి ఇంత పెద్ద స్థాయిలో నివాళి ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. రిలీజ్ తొలి రోజే రూ.154 కోట్ల కలెక్షన్ సాధించి, మొత్తంగా రూ.335 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ఈ సినిమా, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా దీపావళి స్పెషల్‌గా నెట్‌ఫ్లిక్స్, పవన్ కల్యాణ్ చిత్రాన్ని వందలాది దీపాలతో అందంగా అలంకరించి రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ ట్రిబ్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల మనసులు దోచుకుంటోంది.
ఈ వీడియోను చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందంతో మునిగిపోయారు. ‘ఓజీ’ సినిమాలోని “ఎవ్వరికీ అందదు అతని రేంజ్” అనే డైలాగ్‌ను క్యాప్షన్‌గా పెట్టి తమ అభిమానాన్ని ఘనంగా వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు, సినీ ప్రేమికులు కూడా నెట్‌ఫ్లిక్స్ చూపించిన ఈ సృజనాత్మకతకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి, థియేటర్ అయినా ఓటీటీ అయినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రభావం ఏమాత్రం తగ్గదని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0