పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు విద్యార్థుల మృతి
పల్నాడు జిల్లాలో విజయవాడ–చెన్నై హైవేపై జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. స్విఫ్ట్ కారు కంటైనర్‌ను ఢీకొట్టి నుజ్జునిజ్జు అయిన ఘటనపై Fourth Line News పూర్తి వివరాలు.
* విజయవాడ చెన్నై హైవే పై వెళుతున్న కారు
* స్విఫ్ట్ కారు అతి ఘోరంగా నుజ్జునిజ్జు అయింది
* ఈ కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులు
అక్కడికక్కడే చనిపోయారు
* కంటైనర్ వెనుక భాగమును ఢీ కొట్టిన కారు
* స్పాట్లోనే ఎదుగురు చనిపోయినట్టు నిర్ధారణ
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వాటిల్లుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు చనిపోగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోనికి వెళితే.
విజయవాడ చెన్నై హైవే పై వెళుతున్న కారు ఒకేసారి ఎడమవైపు ఆగడంతో దాన్ని వెనుక ఉన్న కంటైనర్ స్లో అయింది. దీంతో వెనక నుండి అతివేగంతో వచ్చిన కారు కంటైనర్ను ఢీ కొట్టి దాని కిందకు చచ్చుకొని వెళ్ళిపోయింది.
ఈ ప్రమాదంలో మారుతి సుజుకి స్విఫ్ట్ కారు అతి ఘోరంగా నుజ్జునిజ్జు అయింది. ఈ కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు ఇద్దరికీ మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఏవిధంగా జరిగిందో పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో సీసీటీవీలో రికార్డయింది ఒకసారి దాన్ని చూడండి.
హైవే పైన వెళ్తున్నప్పుడు గానీ, బైపాస్ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు గానీ, మామూలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గానీ జాగ్రత్తగా వెళ్ళండి. ముందు వెనకాల ఎప్పుడూ ఏ విధంగా ప్రమాదం వచ్చిందో ఎవరికి తెలియదు అని ప్రజలు అంటున్నారు. నిదానమే ప్రధానము. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0