ఆఫ్ఘన్ మంత్రి భారత్‌లో . పాక్ దాడులు! 9 చిన్నారుల మృతి
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై వైమానిక దాడులు జరిపి 9 మంది చిన్నారులు సహా 10 మంది మృతి. ఆఫ్ఘన్ మంత్రి భారత్‌లో ఉన్న వేళ ఈ దాడులు జరుగటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. పూర్తి వివరాలు – Fourth Line News.
Main points :
* మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించిన ఆఫ్ఘన్-పాక్
* 9 మంది చిన్నారులు మరణించారు.
* మరోసారి తలెత్తిన యుద్ధం
* ఆఫ్ఘన్ నాయకులు బాధితులు పర్యటిస్తున్న సందర్భంలో
* మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించిన పాకిస్తాన్
fourth line news :
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య మరోసారి యుద్ధం మళ్లీ ప్రారంభమైంది ఈసారి యుద్ధం తారస్థాయికి చేరాయి. పాకిస్తాన్ నిన్న రాత్రిఆఫ్ఘన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై వైమానిక దాడులకు ప్రారంభించింది. ఈ డ్రోన్ దాడుల్లో నివాస గృహాలు ధ్వంసం కాక 9 మంది చిన్నారులు సహా మొత్తం పదిమంది మరణించినట్టు తాలిబన్ ప్రభుత్వం గుర్తించింది.
ఆఫ్ఘనిస్థాన్ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా ఈ దాడులు పాకిస్తాన్ చేసినట్టు తెలుస్తుంది. అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ ఆఫ్ఘనిస్థాన్ వాణిజ్య మంత్రి సేవలు అందిస్తున్నారు. ఆయన ఇప్పుడు భారత పర్యటనలో ఉండగా ఈ దాడులు జరగటం పట్ల అనేకమైన ప్రశ్నలు వాటిల్లుతున్నాయి. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతి కారంగానే యుద్ధము ప్రారంభించినట్టు తెలుస్తుంది. చాలా కాలము నుండి పాక్ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం ఇస్తుంది అని ఆరోపిస్తుంది.
ఆఫ్ఘానిస్తాన్ నాయకులు భారత్‌లో అధికారిక పర్యటనలు చేస్తున్న ప్రతిసారీ, పాకిస్థాన్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడటం కొత్త విషయం కాదు. గతంలో కూడా విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్ సందర్శిస్తున్న సమయంలో, టీటీపీ చీఫ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు పాక్ ప్రకటిస్తూ అలాంటి దాడులు చేసింది. ఇప్పుడు అదే నమూనా మరోసారి పునరావృతమవడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తిరిగి రగులగొట్టింది.
అత్యంత కీలక సమయంలో జరిగే ఈ దాడులు పాక్–ఆఫ్ఘన్ సంబంధాల్లోని అవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఖతార్, తుర్కియా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా శాంతి స్థిరపడుతుందనే ఆశలు నెలకొన్నాయి. అయితే తాజా దాడులతో ఆ ఒప్పందం దాదాపు అమలులో లేకుండాపోయింది.
దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్తత తీవ్రంగా పెరిగింది. ఇరుదేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉండగా, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పాక్ చర్యలతో మళ్లీ ప్రాంతం అస్థిరత వైపు సాగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
* ఆఫ్ఘనిస్థాన్ నాయకులు భారత్లో పర్యటిస్తున్నప్పుడు పాక్ యుద్ధం చేయడంపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0