సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. రంగంలోకి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కదలికల నేపథ్యంలో పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధం వస్తే ఈసారి ఒకటే దెబ్బ అని స్పష్టమైన సందేశం ఇచ్చింది భారత్.

flnfln
Jan 13, 2026 - 15:22
 0  3
సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. రంగంలోకి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

* పాకు కు వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్ జనరల్ 

* సరిహద్దులలో పాక్ డ్రోన్లు కదలికలు 

* ఆపరేషన్ సింధూర్ ముందుకు కొనసాగుతుంది జాగ్రత్త 

* యుద్ధం వస్తే ఈసారి ఒకటే దెబ్బ ! 

 fourth line news: ఇండియా పాకిస్తాన్ కు మరోసారి సాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. అని పాకుదేశానికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టంగా తెలియజేశారు. సరిహద్దులలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎలాంటి పరిణామాలు చేపట్టిన కూడా భారత్ సైన్యం కఠినంగా స్పందిస్తుంది అని పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సరిహద్దులలో పాకిస్తాన్ డ్రోన్స్ కదిలికలు పెరగటం నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. 

భారత భూసేన, నౌకాదళం, వైమానిక దళం—మూడు దళాలు సమన్వయంతో పనిచేస్తూ శత్రువుల చర్యలను తిప్పికొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము అని ఆర్మూర్ చీఫ్ వెల్లడించారు. సాంకేతికంగా మరింత బలపడిన భారత సైన్యం, డ్రోన్లు, క్షిపణులు, సైబర్ ముప్పుల వంటి ఆధునిక సవాళ్లను సులువుగా ఎదుర్కొంటుందే అని ఆయన పేర్కొన్నారు. 

గత సంవత్సరంలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం దాదాపు 88 గంటలు పాటు సమర్థవంతముగా పనిచేసింది అని గుర్తు చేశారు. ఆ సమయంలో శత్రువుల ప్రయత్నములన్నిటిని పూర్తిగా విఫలం చేయడంలో సైనికుల ధైర్యం, నైపుణ్యం కీలక పాత్ర పోషించింది అన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి యుద్ధాలు వచ్చినా కూడా ఆపరేషన్ సింధూర్ ముందుండి అన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

ముఖ్యంగా సరిహద్దులలో పరిస్థితులన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆర్మ వర్గాలు వెల్లడించాయి. భారతదేశ భద్రత లక్ష్యంగా భారత సైన్యం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంది అని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఉన్నదా అధికారులు ప్రజలకు మన దేశానికి భరోసాని ఇచ్చారు. 

* ఆపరేషన్ సింధూర సమయంలో పాకు కు చుక్కలు చూపించాం మనం అయినప్పటికీ కూడా ఎందుకో రోళ్లతో సర్కస్ చేస్తుంది! దీని వెనకాల ఉన్నది ఎవరు? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.