నిజామాబాద్‌లో శ్రీకాంత్ : ప్రేమికురాలికి వివాహం కుదిరింది అని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
నిజామాబాద్‌లో ప్రేమ విఫలమై లండన్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన. కుటుంబ సభ్యుల నిరసనలు, పోలీసుల విచారణ—Fourth Line News పూర్తి వివరాలు.
* ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది అని ఆత్మహత్య
* లండన్ లో నుంచి వచ్చి అమ్మాయి మోసం చేసింది అని
* ఆరేళ్లుగా ప్రేమ ప్రయాణం చివరకు మరణం
* శ్రీకాంత్ వివాహం చేసుకోవచ్చని వచ్చాడు కానీ
* ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్
* కానీ చివరాఖరుకు ఈ ప్రేమ ఎటో వెళ్ళింది.
* పూర్తి వివరాల్లోనికి వెళితే
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని వేరే వ్యక్తి వివాహం చేసుకుంటున్నాడు అని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దొంచందా గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అఖిలతో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. శ్రీకాంత్ రెడ్డి లండన్లు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఏరుగట్ల గ్రామానికి చెందిన అఖిల శ్రీకాంత్ రెడ్డి చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు.
శ్రీకాంత్ రెడ్డి తను ప్రేమించిన అఖిలను వివాహం చేసుకుందామని లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. కానీ అఖిలాకు వేరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకొని తీవ్ర దుఃఖములోనికి గురయ్యారు. ఆ దుఃఖంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. పరిస్థితి చాలా విషమించడంతో కుటుంబ సభ్యులు శ్రీకాంత్ రెడ్డిని ఆసుపత్రులకు తరలించారు. కానీ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మాకు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తూ ఏరుగట్ల గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసుల వాహనంపై ఉంచి నిరసనలు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి విచారణ చేపడుతున్నారు.
* ఎవరైనా గానీ ప్రేమించిన అమ్మాయి అబ్బాయి దక్కలేదు అని సూసైడ్ చేసుకోమాకండి. సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు మీ బాధను చెప్పండి. చచ్చిపోతే ఏది సాధించలేము.
* మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0