నిజామాబాద్‌ బాల్కొండలో విషాదం: కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 10 ఏళ్ల బాలిక కుక్క కరిచిన నెల తర్వాత రేబిస్‌తో మరణించింది. కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యుల సూచన

flnfln
Oct 26, 2025 - 14:04
 0  6
నిజామాబాద్‌ బాల్కొండలో విషాదం: కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గడ్డం లక్షణ(10) అనే చిన్నారి కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. వివరాల ప్రకారం, కొన్ని రోజుల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా కుక్క గీరడంతో తలకు గాయం అయింది. ఇంట్లో మందలిస్తారనే భయంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా వదిలేసింది.

గత మూడు రోజులుగా ఆమె వింతగా ప్రవర్తిస్తూ, కుక్కలా అరుస్తుండడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేబిస్ తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.

డాక్టర్లు హెచ్చరిస్తూ— కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.