రైలు ప్రమాదం.. : నవ దంపతులు మృతి.? ఎలా ప్రమాదం జరిగిందంటే .?
విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి నవ దంపతులు సింహాచలం, భవాని మృతి చెందారు. వివాహమైన రెండు నెలలకే ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు Fourth Line News లో.
* కొత్త వివాహం జరిగింది కొన్ని కొన్ని ప్రమాదం
* సంతోషంగా బంధువుల ఇంటికి వెళ్ళాలి
* అనుకోకుండా ఇద్దరు భార్య భర్తలు మరణించారు
fourth line news : వివాహం జరిగి కొన్ని నెలలు అయింది. కానీ అనుకొని ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడం జరిగింది. పూర్తి వివరాల్లోనికి వెళ్తే. రెండు నెలల క్రితం వారికి వివాహం జరిగింది. కొత్త కాపురం చాలా ఆనందంగా కొనసాగుతున్న వేల ఊహించని ఒక ప్రమాదం వల్ల ఇద్దరు మరణించారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైల్ ఎక్కారు అదే వారి చివరి ప్రయాణము అయింది.
మన్యం జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని తో సింహాచలం వివాహం జరిగింది. నవ దంపతులు జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు . కొత్తగా వివాహం జరిగింది కాబట్టి కొన్ని రోజులు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి సింహాచలం భవాని గురువారం రాత్రి సికింద్రాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలు చాలా రద్దీగా ఉండటంతో వారు డోర్ దగ్గర నిలబడ్డారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత వారిద్దరూ రైలు నుంచి జారీ కిందపడి మృతి చెందారు. శుక్రవారం ఉదయం ట్రాక్మెన్ వారిద్దరిని గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. సంతోషంగా బంధువులతో గడుపుదామని వెళ్ళిన వారు చివరాఖరికి మృత్తి వాట పట్టారు. ఈ వార్త ఆ గ్రామ ప్రజలందరికీ దుఃఖాన్ని కలిగించింది. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0