నెల్లూరులో ఉద్రిక్తత… హత్య నిందితుల దాడి–పోలీసుల ప్రతికూల్పులు!

నెల్లూరు కొవ్వూరులో హత్య కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి జరిగిన ఘటన ఉద్రిక్తత సృష్టించింది. ఆత్మ రక్షణలో పోలీసులు కాల్పులు జరపగా ఒక నిందితుడు మోకాలి వద్ద గాయపడ్డాడు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

flnfln
Nov 29, 2025 - 10:57
 0  3
నెల్లూరులో ఉద్రిక్తత… హత్య నిందితుల దాడి–పోలీసుల ప్రతికూల్పులు!

* నెల్లూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది 

* నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు 

* పోలీసులపై దాడి చేసి తప్పించుకున్న నిందితులు 

* ఆత్మ రక్షణ కొరకు పోలీసులు కాల్పులు 

* ఒక నిందితుడి మోకాల్లో బుల్లెట్ 

* గాయపడిన పోలీసుని గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే 

fourth line news : ఈ ఘటన నెల్లూరు జిల్లా కొవ్వూరులోని షుగర్ ఫ్యాక్టరీ దగ్గర జరిగింది. ఓ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను నిందితులు చూసి కత్తులతో దాడికి ప్రయత్నించారు. వారి మధ్యన తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తి దారుణగా హత్య చేయబడ్డాడు.

 పోలీసులు ఈ కేసులో నిందితులు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారన్న సమాచారంతో ఈరోజు వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. నిందితులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా తమ వద్ద ఉన్న కత్తులతో వారిపైన దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణ కి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆత్మ రక్షణ కోసం నిందితుల పైన కాల్పులు చేపట్టారు. 

పోలీసులు కాల్పులు చేసినప్పుడు జేమ్స్ అనే నిందితుడి మోకాలికి బుల్లెట్ తగిలింది. గాయపడిన కానిస్టేబుల్ ఆదినారాయణ అలాగే నిందితుడు జేమ్స్ ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఈ హత్య కేసులో ఉన్న తొమ్మిది మంది నిందితులను పరారీలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతం అంతట కల్లోలం సృష్టించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.