కొడుకు కోసం కూతుర్ని చంపిన తల్లి.. పోలీస్ విచారణలో బయటపడ్డ నిజాలు

నవీ ముంబైలో అమానుషం! కొడుకు కావాలన్న కోరికతో ఆరేళ్ల కూతురిని చంపిన కన్నతల్లి. చదువుకున్న మహిళే ఇలా ఎందుకు చేసింది? ఈ దారుణ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 28, 2025 - 13:58
 0  5
కొడుకు కోసం కూతుర్ని చంపిన తల్లి.. పోలీస్ విచారణలో బయటపడ్డ నిజాలు

1. కొడుకు కావాలి అని సొంత కూతుర్ని చంపిన తల్లి 
2. చిన్నారి చనిపోవడం బంధువులందరూ ఆందోళన. 
3. పోస్టుమార్టం లో నిజాలు బయటకు వచ్చాయి 
4. కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే.? 
5. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, పాపపై ఉన్న కొంత కోపం. 
6. పూర్తి వివరాలు కింద ఉన్న సంవత్సరంలో ఉన్నాయి:

నవీ ముంబైలో చోటుచేసుకున్న ఈ  ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.కొడుకు కావాలని  కోరికతో ఎంతటే దారుణానికి వేడుకట్టిందో.ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. చదువుకున్న మహిళే ఇలా ప్రవర్తించడంపై సమాజం మొత్తం షాక్‌కు గురవుతోంది.

కళంబోలి ప్రాంతంలోని గురు సంకల్ప్ సొసైటీలో నివసించే సుప్రియా మహామున్కర్ (30) తన ఆరేళ్ల కుమార్తె మాన్సి అనారోగ్యంతో మృతి చెందినట్లు ఈ నెల 23న పోలీసులకు సమాచారం ఇచ్చింది. మొదట ఇది సహజ మరణమేనని భావించిన పోలీసులు, చిన్నారి మృతిపై కుటుంబ సభ్యుల వాఖ్యాల్లో తేడాలు కనిపించడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోస్టుమార్టం నిర్వహించగా, చిన్నారి మరణం సహజ కారణాల వల్ల కాదని, శ్వాస ఆడకపోవడం కారణమని వైద్య నివేదికలో తేలింది.

ఈ నివేదిక ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి, తల్లి సుప్రియను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఆమె తన కుమార్తెను తానే చంపినట్లు అంగీకరించింది. కొడుకు పుట్టాలన్న కోరిక నెరవేరకపోవడం, కుటుంబ ఒత్తిళ్లు, వ్యక్తిగత అసంతృప్తులే ఈ దారుణానికి కారణమని ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల ప్రకారం, సుప్రియా సైన్స్ గ్రాడ్యుయేట్. చదువు ఉన్నప్పటికీ ఆమె ఆలోచనలు తీవ్రంగా లింగ వివక్షతో నిండిపోయినవని విచారణలో తెలిసింది . కుమార్తె స్పష్టంగా మాట్లాడలేకపోతుందన్న భావన, మరాఠీ కాకుండా హిందీ మాట్లాడుతోందన్న బాధ  కూడా ఆమె మనసులో పెరిగిన కోపానికి కారణాలుగా మారినట్లు తెలుస్తోంది. ఇవన్నీ కలిసి ఆమె మానసిక స్థితిని మరింత అస్థిరంగా చేశాయని పోలీసులు చెబుతున్నారు.

ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, 2019లో మాన్సి పుట్టిన కొన్ని నెలలకే ఇలాంటి ప్రయత్నం ఒకసారి జరిగినట్లు భర్త ప్రమోద్ మహామున్కర్ పోలీసులకు వెల్లడించారు. అప్పట్లో చిన్నారి ప్రాణాలతో బయటపడినా,ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో తగిన వైద్య, మానసిక చికిత్స కొనసాగించి ఉంటే ఈ విషాదం తప్పేదేమోనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

దర్యాప్తులో భాగంగా సుప్రియా 2024 నుంచి డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే చికిత్స ఉన్నప్పటికీ ఆమెను నిరంతరం పర్యవేక్షించకపోవడం, కుటుంబ మద్దతు లోపించడం ఈ ఘోరానికి దారితీసినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపుతోందని వారు అంటున్నారు.

ప్రెసెంట్ అయితే సుప్రియను కోర్టులో పోలీసులు హాజరు పరచగా, ఆమెకు పోలీస్ కస్టడీ విధించింది. బాలలపై నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు ఆమె మీద నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలలోనూ, కుటుంబంలో ఉన్న సమస్యలు, మానసిక పరిస్థితిని అన్నిటిని పరిశీలించాము అని అధికారులు చెప్పారు. 

ఈ ఘటన ఎప్పుడైతే బయటకు వచ్చిందో మహిళా సంఘాలు, బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమాజంలో కొడుకు కోసం కుమార్తెలపై ఇంకెన్ని దాడులు జరుగుతాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. చదువుకున్న వారు కూడా ఈ విధంగా చేస్తే ఎలా అని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి

*చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
*ఆడపిల్ల అయినా మగ బిడ్డ అయినా అందరూ సమానమే కదా. 
*ఈ కేసు మీరు ఎటు వెళ్తుందో ముందు ముందు జరిగే సంఘటనలు అన్నిటిని ఈ న్యూస్ వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.