అసెంబ్లీ మార్షల్స్ దురుసు తీరుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. "ఇంకా తాడేపల్లి రాజ్యం అనుకుంటున్నారా?"
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భద్రతా సిబ్బంది ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మార్షల్ దురుసుగా ప్రవర్తించడంపై ఆయన మండిపడి, “ఇంకా తాడేపల్లి పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా?” అంటూ సిబ్బందిని హెచ్చరించారు.
* అసెంబ్లీ లాబీలో మార్షల్స్ వ్యవహారంపై మంత్రి లోకేశ్ తీవ్ర అసంతృప్తి
* ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మార్షల్ అనుచిత ప్రవర్తన
* మీడియాతో మాట్లాడుతుండగా తోసేయడానికి యత్నం
* “ఇంకా తాడేపల్లి రాజ్యం కొనసాగుతోందా?” అంటూ లోకేశ్ ఆగ్రహం
* ఎమ్మెల్యేల పనుల్లో జోక్యం చేయొద్దని సిబ్బందికి కఠిన హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భద్రతా సిబ్బంది ప్రవర్తనపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేతో మార్షల్ అనుచితంగా వ్యవహరించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. “ఇంకా తాడేపల్లి పాలన కొనసాగుతోందని భావిస్తున్నారా?” అంటూ సిబ్బందిని కఠినంగా హెచ్చరించారు మంత్రి నారా లోకేశ్.
ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే అసెంబ్లీ లాబీలో ఈ సంఘటన జరిగింది. మంత్రి లోకేశ్ కార్యాలయం బయట టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక మార్షల్, లాబీలో ఎవరూ ఉండకూడదని హెచ్చరిస్తూ వెంటనే వెళ్లిపోవాలని గట్టిగా ఆదేశించాడు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే నరేంద్రను తాకుతూ, పక్కకు నెట్టే ప్రయత్నం కూడా చేశాడు.
మార్షల్ ప్రవర్తనపై ఎమ్మెల్యే నరేంద్ర తీవ్ర ఆగ్రహంతో స్పందించి అతనిపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ సమయానికే తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన మంత్రి లోకేశ్ ఆ ఘటనను గమనించారు. వెంటనే మధ్యలోకి వచ్చి మార్షల్‌పై కఠినంగా స్పందించారు. సభ్యుల పనుల్లో జోక్యం చేసుకోవడం మీ బాధ్యత కాదని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.
“ఎమ్మెల్యేల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు. పాసులు లేని వారు లోపలికి ప్రవేశించకుండా చూడటం మాత్రమే మీ బాధ్యత. కానీ సభ్యుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు” అని లోకేశ్ సిబ్బందికి స్పష్టంగా తెలిపారు. విధుల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తే అసలు సహించబోమని ఆయన గట్టిగా హెచ్చరించారు మంత్రి నారా లోకేశ్.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0