ప్రియుడి కోసం కన్నబిడ్డను హత్య చేసిన తల్లి – మెదక్‌లో కలకలం

A shocking crime in Medak district where a mother, along with her lover, brutally killed her two-year-old daughter to continue their illicit affair. Police recovered the decomposed body after months of search.

flnfln
Sep 13, 2025 - 11:59
Sep 13, 2025 - 18:03
 0  5
ప్రియుడి కోసం కన్నబిడ్డను హత్య చేసిన తల్లి – మెదక్‌లో కలకలం

ప్రియుడితో కోసం కన్న కూతుర్ని చంపిన కసాయి తల్లి 

మెదక్ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతుర్ని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో ఆ ప్రియుడు కూడా భాగస్వామి అయినట్టు తెలుస్తుంది. ఇద్దరు కలిసి ప్లాన్ అమలుపరిచీ చిన్నారిని అని చూడకుండా వివాహేతర ప్రియుడితో తన కూతుర్ని చంపిన కసాయి తల్లి.

శభాష్ పల్లి గ్రామానికి చెందిన మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపూడి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లి అయ్యింది. ఇద్దరు స్టార్టింగ్ లో చాలా సంతోషంగా ఉండి ఇద్దరు పిల్లలు కూడా కన్నారు. కొంతకాలం ఆనందంగానే ఉన్నారు.

అయితే ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది మమత. కొంత కాలమైన తర్వాత కుటుంబ సభ్యులు తనకి ఎంత నచ్చ చెప్పిన గాని తన భర్తతో ఉండడానికి నిరాకరించింది మమత. ఎన్నిసార్లు చెప్పినా గానీ భర్త ఇంటికి వెళ్లానంటూ మొండి పట్టు పట్టింది మమత దాంతో బంధువులు కూడా ఏమి అనలేకపోయారు. 

 కొన్ని రోజుల తర్వాత మే 27న రెండేళ్ల కూతురు తనుశ్రీని ఇంటి నుండి వెళ్లిపోయింది మమత. రోజులు వారాలు నెలలు గడిచిన గాని మమత ఆచూకీ తెలియకపోవడంతో. మమత తండ్రి రాజు శివంపేట పోలీసులకి జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మమత ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో నరసరావు పేటలో ఉందని అక్కడికి వెళ్లి మమతాను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. అలాగే మమతతో ఫయాజ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది అని తెలుసుకున్నారు పోలీసులు. అయితే చిన్నారి అయినా తనుశ్రీ కనిపించలేకపోవడంతో ఇద్దరినీ ప్రశ్నించడం జరిగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి పొంతనలేని జవాబులు చెబుతూ ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో పోలీసులు ఇంటర్నేషనల్ చేయడం జరిగింది. దీంతో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. 

చిన్నారిని చంపింది మేమే  :

తనుశ్రీని తామే హత్య చేసినట్టు మమత ఒప్పుకోవడం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుంది అని చిన్నారిని కొట్టి గొంతు నులిమి చంపేశానని తల్లి మమత చెప్పడం జరిగింది. ప్రియుడు ఫయాజ్ ఈ హత్య చేయడంలో సహకరించాడు అని తెలిసింది. 

చిన్నారి మృత దేహాన్ని శభాష్ పల్లి గ్రామ శివారులో పాతిపెట్టినట్టు పారిపోయినట్టు నిజాన్ని ఒప్పుకున్నారు నిందితులు. వెంటనే పోలీసులు శభాష్ పల్లికి తీసుకొని వచ్చి మృతదేహాన్ని పూచిన ప్లేస్ కి తీసుకొని వెళ్లారు. ఒక జెసిపి ని పిలిపించి పాతిపెట్టిన దగ్గర తొవ్వించి మృతదేహాన్ని బయటికి తీశారు. చిన్నారిని పూడ్చిపెట్టి మూడు నెలలు కావడంతో ఎంతో కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి మృతదేహం ఉంది. ఈ హత్య చేసిన ఇద్దరిని పోలీసులు మమతా ని మరియు ప్రియుడు ఫయాజ్ అదుపులోనికి తీసుకున్నారు. ఈ సంగతి నిన్న మెదక్ జిల్లా ప్రజలందరూ ఎంతో షాక్ అయినట్టు తెలుస్తుంది. ప్రియుడు మోజులో పడి కన్నా బిడ్డను కూడా చంపుకుంది అని గ్రామ ప్రజలందరూ ఎంతో కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. 

వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాల కాపురాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అన్యం పుణ్యం తెలియని పసిపిల్లలు చంపబడటం జరుగుతుంది. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.