నిన్న ఊరి సేవకుడు.. నేడు ఊరి నాయకుడు: 19 ఏళ్ల నిబద్ధతకు పట్టం కట్టిన తొండాల ప్రజలు!
తెలంగాణలోని నిర్మల్ జిల్లా తొండాల గ్రామంలో అద్భుతం జరిగింది. 19 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా ఊరిని శుభ్రం చేసిన మిరేకర్ మాధవ్, నేడు అదే ఊరికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఫోర్త్ లైన్ న్యూస్ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం మీకోసం.
1. సిపాయిగా ఉన్న అతను సర్పంచ్ గా ఎలా అయ్యాడు?
2. ప్రజలందరూ కలిసి ఓట్లు వేశారా?
3. నిజాయితీ, కష్టపడే వ్యక్తిత్వం, మంచి గుణం ఉంటే చాలా?
4. కచ్చితంగా అభివృద్ధి చేస్తాను అని హామీ?
5. గ్రామస్తులందరికి నేను రుణపడి ఉంటా.
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, తానూర్ మండలం, తొండాల గ్రామానికి చెందిన మిరేకర్ మాధవ్ ప్రజాస్వామ్యంలో నిజంగా ఏదైనా సాధ్యమేనని తన జీవితాన్ని ఒక పాఠం మనం నేర్చుకోగలము.
అసలు ఏం జరిగింది అంటే ?
గత 19 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ, ఊరి పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించిన మాధవ్, ఎప్పుడూ గ్రామాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసేవాడు . కష్టపడి పనిచేసే స్వభావం, నిజాయితీ, గ్రామంపై ఉన్న ప్రేమ కారణంగా గ్రామస్తుల ఆదరణ ప్రేమ సంపాదించుకున్నాడు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ పదవికి పోటీ చేసిన మిరేకర్ మాధవ్, గ్రామ ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించారు. నిన్న ఆయన అధికారికంగా సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. గ్రామస్తులందరూ తనలో ఉన్న నిజాయితీని చూసి ఓటు వేసి గెలిపించారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, “సఫాయి కార్మికుడిగా ఉన్న నన్ను నమ్మి, ఊరి నాయకత్వం అప్పగించిన గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు నా జీవితాంతం కృతజ్ఞుడిని. నా మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చేందుకు నిజాయితీగా పనిచేస్తాను. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, సంక్షేమమే నా లక్ష్యం” అని తెలిపారు.
సఫాయి కార్మికుడి స్థాయి నుంచి సర్పంచ్ పదవి వరకు ఎదిగిన మిరేకర్ మాధవ్ ప్రయాణం, ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతూ, యువతకు మరియు సామాన్య ప్రజలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. ఫోర్త్ లైన్ న్యూస్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0