మెగాస్టార్ చిరంజీవి యంగ్ లుక్ స్టిల్స్ రిలీజ్.. సంక్రాంతికి సినిమాపై భారీ అంచనాలు
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా నుంచి విడుదలైన యంగ్ లుక్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
* మెగాస్టార్ చిరంజీవి కొత్త ఫొటోస్ రిలీజ్
* ఆ ఫోటోలో యంగ్ గా స్టైల్ గా ఉండడం
* వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది
* ఫొటోస్ చూసిన అభిమానులు మామూలుగా
* సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూపు
* సినిమాని నిర్మిస్తుంది అనిల్ రావుపూడి
* అసలు పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news కథనం : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు , చిత్ర బంధం సరికొత్తహెచ్‌డీ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు మేలుకొని ఉన్నాయి అని మెగా అభిమానులు అంటున్నారు. ఇటీవలే తాజాగా రిలీజ్ చేసిన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో చాలా ఎనర్జీగా ఉన్న స్టైల్ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ సినిమా వచ్చే సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానులను ఆనందపరచడానికి ఓ ప్రత్యేక ఫోటోని కూడా ప్రారంభించారు.
ఇటీవల విడుదలైన కొత్త స్టిల్స్‌ను ఆధారంగా తీసుకుని క్రియేటివ్ డిజైన్లు రూపొందించాలని చిత్ర బృందం అభిమానులను కోరింది. వాటిలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న డిజైన్లను ఎంపిక చేసి, ప్రత్యేకమైన ‘MSG’ మర్చండైజ్ను బహుమతిగా అందజేస్తామని వెల్లడించింది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార, కేథరిన్ త్రెసా నటిస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేసింది.
ఈ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి చాలా యంగ్ స్టైల్ లో ఉన్నారు. ఈ ఫోటోతో మెగాస్టార్ అభిమానులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. మెగాస్టార్ సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో. ఇప్పుడు వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఎలా ఉండబోతుందో మీ అక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా సినిమా ప్రతి అప్డేట్ మీరు చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0