బుగ్గమ్మ : మత్తులో వేధింపులు… భార్య, కుమారుడితో కలిసి భర్త హత్య చేసిన ఘటన
హైదరాబాద్ మేడిపల్లిలో మద్యం మత్తులో భార్యను వేధిస్తున్న భర్తను కుటుంబ సభ్యులు కలిసి టవల్‌తో ఊపిరాడకుండా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. కేసు వివరాలు Fourth Line News
* మద్యం తాగి భర్త వేధింపులు తట్టుకోలేక భర్తను హత్య
* టవల్ తో వేరొక బిగించి ఊపిరాడకుండా
* అడ్డుకుంటున్న కూతుర్ని గదిలో బంధించిన తల్లి
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news :
సంఘటన స్థలం : హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్‌కేసర్‌లో జరిగింది.
మద్యం సేవించిన భర్త రోజు తాగే వేధిస్తున్నాడు అని భార్య ఆమె కుమారుడు కలిసి ఈ హత్య చేశారు. ఈ హత్య ఇప్పుడు హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాటిల్లుకుంది.
పోలీసులు ఈ కేసులో వివరాలు ప్రకటించారు : బోడుప్పల్ దేవేంద్ర నగర్ లో నివాసం ఉంటున్న బండారు అంజయ్య 55, అతను ఒక ప్రైవేట్ పాఠశాలల్లో బస్ డ్రైవర్ గా జీవనాన్ని సాగిస్తున్నాడు. అతని భార్య పేరు బుగ్గమ్మ, వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. అంజయ్య ప్రతిరోజు మద్యం సేవించేవాడు. ఈమధ్య మత్తులో ఉన్న అంజయ్య ప్రతిరోజు తన భార్యను పిల్లలను తీవ్రంగా వేధించేవాడు.
ఈ గురువారం రాత్రి అంజయ్య మద్యం తాగి ఉండగా భార్య బుగ్గమ్మ, కుమారుడు రాజు, సమీప బంధువైన శేఖర్ అందరూ కలిసి వేధిస్తున్న అంజయ్యను అర్ధరాత్రి మెడకు టవల్ బిగించి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు. ఈ హత్య చేస్తున్న సమయంలో అంజయ్య కుమార్తె వారిని అడ్డగించింది కానీ ఆమెను ఒక రూములో బంధించారు.
అంజయ్య కుమార్తె ఈ విషయాన్ని పోలీసులు తెలియజేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపే అంజయ్య చనిపోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను హదువులోనికి తీసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసు వెల్లడించారు.
* అంజయ్య ఆవిధంగా తాగి వేదించడం తప్పు
* కుటుంబ సభ్యులు అందరూ కలిసి అతన్ని చంపడం కూడా తప్పు
* మద్యం తాగి కుటుంబ వ్యక్తులను ఇబ్బంది పెట్టడం కంటే మద్యం మానివేసే అందరితో ఆనందంగా ఉండటం ఉత్తమమైన పని.
* మీలో ఎవరైనా మద్యం సేవించే వాళ్లయితే మద్యాన్ని దూరం పెట్టండి కుటుంబానికి దగ్గరకండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0