అంత్యక్రియల మధ్యలో కళ్లు తెరిచిన వ్యక్తి.. అందరూ షాక్!

కర్ణాటకలో షాకింగ్ ఘటన. చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేస్తుండగా, నారాయణ అనే వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

flnfln
Nov 9, 2025 - 13:20
 0  6
అంత్యక్రియల మధ్యలో కళ్లు తెరిచిన వ్యక్తి.. అందరూ షాక్!

కర్ణాటకలో ఒక అద్భుత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని భావించి అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా, వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తెరచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

బెలగావి జిల్లా బెటగేరి గ్రామానికి చెందిన నారాయణ (38) కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. నవంబర్ 6న వైద్యులు అతనిపై శస్త్రచికిత్స నిర్వహించగా, కొద్ది సేపటికే “చనిపోయాడు” అని ప్రకటించారు.

దాంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అంతా ఏర్పాట్లు జరుగుతుండగా నారాయణ ఒక్కసారిగా కళ్లు తెరచాడు. ఈ దృశ్యం చూసి అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. వెంటనే అతన్ని తిరిగి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.