—మహేశ్ బాబు ప్రత్యేక విజ్ఞప్తి: గ్లోబ్ ట్రొట్టర్ ఈవెంట్‌కి పాసులతోనే రండి
SSMB29 GlobeTrotter ఈవెంట్‌కు పాసులతోనే హాజరవాలని మహేశ్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సూచనలు పాటించాలని, పోలీసులు-స్టాఫ్‌కు సహకరించాలని వీడియో ద్వారా కోరారు.
SSMB29 కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, రేపు జరగనున్న GlobeTrotter ఈవెంట్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
ఈ సందర్భంలో ఒక వీడియో ద్వారా మహేశ్ బాబు తన ఫ్యాన్స్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈవెంట్‌కు ప్రవేశం పాసుల ఆధారంగా మాత్రమే ఉంటుందని స్పష్టం చేసిన మహేశ్, ప్రతి ఒక్కరూ అధికారులు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. పోలీసులు, గ్రౌండ్ స్టాఫ్ చేస్తున్న పనికి సహకరించాలంటూ వినయపూర్వకంగా అభ్యర్థించారు.
పాసులు లేకుండా రావద్దు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలానే ప్లాన్ చేస్తున్నాం… అందరం కలిసి రేపు ఆనందంగా కలుద్దాం" అని మహేశ్ బాబు చెప్పారు. ఆయన సందేశంతో ఈవెంట్‌కు సంబంధించి అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.
Tomorrow it is… 🤗🤗🤗
Come safely, enjoy it and go home safely.❤️❤️❤️ #GlobeTrotter pic.twitter.com/5ybhjJ5ZP4 — Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0