చిన్న గొడవ దానికే ట్రైన్ లో నుంచి దూకేయాల ? వీరికి పెళ్లి రెండు నెలలు అయింది ?
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో నవ దంపతుల మృతి కేసులో సంచలన వీడియో బయటపడింది. గొడవ పడి భార్య దూకడంతో, భర్త కూడా దూకిన దృశ్యాలు ప్రయాణికుడి ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
* పెళ్లయి రెండు నెలలు అయింది అంతే కానీ
* విచారించగా ఒక వీడియో బయటకి వచ్చింది
* ఇంతకీ పోలీసులు ఏమని చెప్తున్నారు
* వారితో ప్రయాణించిన ప్రయాణికుడు రికార్డ్ చేసిన
పూర్తి వివరాల్లోనికి వెళ్తే : కథనం:
ట్రైన్ లో నుంచి జారిపడిన దంపతుల కేసు మరో మలుపు తిరిగింది యాదాద్రి భువనగిరి జిల్లాలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుండి జారిపడిన నవ దంపతులు మధ్య జరిగిన గొడవలే వారి మరణానికి దారితీసాయి అని తెలుస్తుంది. వాళ్లతోనే ప్రయాణించిన ఒక ప్రయాణికుడు తీసిన వీడియో ఈ కేసులో కీలక ఆధారాలుగా మారింది. దీన్ని బట్టి పోలీసులు పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.
కోరాడ సింహాచలం వయసు 25 భవాని 19 వీళ్ళిద్దరికీ రెండు నెలల క్రితమే వివాహం అయింది. అయితే హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. వీరు గురువారం రాత్రి విజయవాడలోని ఒక బంధువుల ఇంటికి వెళ్లేందుకు సికింద్రాబాద్ మచిలీపట్టణం ఎక్స్ప్రెస్ ఎక్కటం జరిగింది. ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు వీరి మధ్య తీవ్ర గొడవ ఏర్పాటయింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవను తోటి ప్రయాణికుడు ఒకరు తన ఫోన్లో రికార్డు చేయడం జరిగింది. వారిద్దరికీ మాట మాట పెరగడంతో క్షణ ఆవేశానికి లోనైన భవాని కదులుతున్న రైలు నుండి కిందికి దూకేసింది దాన్ని చూసి భయ ఆందోళనకు గురైన భర్త సింహాచలం కూడా ఆమె వెంట దూకుడముతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించడం జరిగింది. కానీ ఇంతకుముందు వారిద్దరూ ట్రైన్ నుంచి జారిపడటం వల్ల చనిపోయారు అని వార్తలు బయటికి వచ్చాయి. కానీ తోటి ప్రయాణికుడు తీసిన వీడియోలు బట్టి చూస్తే వారంతటికి వారే ట్రైన్ లో నుంచి దూకేశారు అని తెలుస్తుంది.
ఆలేరు రైలు మార్గంలో ట్రాక్మెన్ వారిద్దరి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడం. వారితో పాటు ప్రయాణించిన వ్యక్తి తీసిన వీడియో వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు . నవ దంపతులకు వివాహం జరిగే రెండు నెలలు అయింది శనికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి మరణానికి దారితీసింది. అందుకనే భార్యాభర్తలకు ఎప్పుడు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు మౌనం పాటించాలి. అప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని తగాదాలు వచ్చినా కలిసి మెలిసి జీవించగలుగుతారు అని పెద్దలు చెప్తున్నారు. జీవితం ఇంకా ఎంతో ఉండగా జీవితాన్ని అనుభవించకుండా మధ్యలోనే వారి ప్రాణాలను వారే తీసుకున్నారు. అందుకనే శనిక ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా అనేకమైన వార్తలను మీరు చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0