ఖమ్మం గడ్డపై కేటీఆర్ గర్జన: జనవరి 7న భారీ పర్యటన
జనవరి 7న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో భేటీ అయి భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జనవరి 7న ఖమ్మం జిల్లాకు కేటీఆర్ రాక… ఉత్సాహం
1. కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన.
2. జనవరి 7న కేటీఆర్ ఖమ్మంలో పర్యటించనున్నారు.
3. ఈ పర్యటన రాబోయే ఎలక్షన్స్ మేరకేనా?
4. గెలిచిన కొత్త సర్పంచులకు స్పష్టమైన సందేశం ఏంటి?
5. మళ్లీ BRS గెలవబోతుందా?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జనవరి 7న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి జిల్లా పార్టీ వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్లతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను అభినందించడంతో పాటు, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సర్పంచ్లతో చర్చించనున్నారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ కీలక సూచనలు చేయనున్నారని, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తారని బీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. గ్రామ స్థాయి నుంచే పార్టీని బలంగా నిలబెట్టేందుకు అవసరమైన వ్యూహాలపై కేటీఆర్ దృష్టి సారించనున్నారని సమాచారం.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పునఃసంఘటనలో భాగంగా ఈ పర్యటన కీలకంగా మారనుంది. జిల్లా పార్టీ నిర్మాణం, నాయకత్వం, కార్యకర్తల పాత్రపై కూడా కేటీఆర్ సమీక్ష చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పార్టీని ప్రజలతో మరింత దగ్గర చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని ఆయన సూచించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన విజయవంతంగా చేయాలి అని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా గెలిచిన సర్పంచులకు పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు, ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రాముఖ్యంగా గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలలోనికి మరింత లోతుగా తీసుకువెళ్లే వ్యూహంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్టు సమాచారం వస్తుంది. కొత్తగా గెలిచిన సర్పంచులకు ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి అని స్పష్టమైన సందేశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
మొత్తంగా చూసుకున్నట్లయితే 27న జరుగుతున్న కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన టిఆర్ఎస్ కు రాజకీయంగా కీలక మలుపుగా మారినట్టు పార్టిసి శ్రేణులు, వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పర్యటన ద్వారా పార్టీలో ఉన్న నాయకులకు అధికారులకు కొత్త సర్పంచులకు కొత్త ఉత్సాహం వస్తుంది అని, భవిష్యత్తు రాజకీయ పోరాటాలకు బలమైన పునాది వేస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
*మరి కెసిఆర్ పర్యటన ఏవిధంగా ఉండబోతుంది?
*మళ్లీ టిఆర్ఎస్ పాలన వస్తుందా ?
*మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0