కేటీఆర్ వస్తున్నారు.. ఖమ్మం కోటపై గులాబీ జెండా ఎగురవేసేందుకు మాస్టర్ ప్లాన్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 7న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. గెలిచిన సర్పంచుల సన్మానం, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
1. KTR పర్యటన వెనుక ఉన్న అసలు నిజం?
2. కొత్తగా గెలిచిన సర్పంచులందరికీ కొత్త జోష్
3. కార్యకర్తలందరికీ ఏ భరోసా ఇవ్వనున్నారు?
ఖమ్మం జిల్లా BRS పార్టీని బలపరిచేందుకు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ జనవరి 7న పర్యటించబోతున్నారు అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను కేటీఆర్ ఘనంగా సన్మానించనున్నారు. పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ప్రతినిధుల అందరిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యము అని తెలుస్తుంది.
సన్మాన కార్యక్రమం అనంతరము పలు ప్రాంతాల్లో నిర్వహించబోతున్న కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించునున్నారు. తెలంగాణ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అలాగే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలపై ఆదేశాలు ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అనుచరులందరినీ ఉత్సాహపరిచి ముందున్న ప్రతి ఎన్నికల్లో ఉత్సాహంగా వెళ్లాలి అని కేటీఆర్ దృష్టి పెట్టినట్టు సమాచారము వస్తుంది.
ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేలా శ్రేణులు ఐక్యమత్యంగా పనిచేయాలి అని కేటీఆర్ పిలుపునివ్వనున్నారు అని తెలుస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రజలకి తీసుకువెళ్లే బాధ్యతను కార్యకర్తలకు గుర్తు చేయనున్నట్టు BRS నేతలు పేర్కొన్నారు. కేటీఆర్ రావడం వల్ల నైనా పార్టీలో ఉన్న శ్రేణులు అందరికీ కొత్త ఉత్సాహం కలుగుతుంది అని పార్టీ శ్రేణులు ఆశిస్తూ ఉన్నారు.
*BRS పార్టీ అధికారంలోనికి వస్తుందా?
*మీ యొక్క ఆలోచనను కామెంట్ రూపంలో తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0