ఖమ్మంలో చైనా మాంజా వాడితే జైలుకే.. సీపీ సీరియస్ వార్నింగ్!
ఖమ్మం జిల్లాలో చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, పర్యావరణ హితమైన మాంజా వాడాలని సూచించారు.
1. చైనా మాంజా వాడొద్దు.
2. చైనా మాంజావాడటం వల్ల ఏమవుతుంది!
3. పోలీస్ కమిషనర్ ఏమి ఆదేశాలిచ్చారు?
4. సంక్రాంతి పండుగ సమయంలో పోలీసులు తనిఖీలు?
సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీగా మారినప్పటికీ, చైనా మాంజా వాడకం వల్ల తీవ్ర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనా మాంజాలో ఉండే గాజు తుక్కులు, రసాయన పదార్థాల వల్ల పక్షులు గాయపడడం, బైకు బై వెళ్తున్న వాహనదారులకు తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న వారికి కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని పోలీస్ కమిషనర్ వెల్లడిస్తున్నారు
ఈ నేపథ్యంలో జిల్లాలో చైనా మాంజా విక్రయాలు, నిల్వలు, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను విక్రయించినా లేదా వినియోగించినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక పోలీస్ బృందాలతో మార్కెట్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను చైనా మాంజా వాడకుండా అవగాహన కల్పించాలని, పర్యావరణానికి హాని కలిగించని సాధారణ పత్తి మాంజానే ఉపయోగించాలని సూచించారు. పక్షులు, జంతువులు, మనుషుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి.
నిజానికి ఈ చైనా మంజే ద్వారా అనేకమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. బైక్ పైన వెళ్తున్న వారి మెడకు చుట్టుకొని మెడ కట్ అయిపోయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కాబట్టి పిల్లలు గని పెద్దలుగాను ఎవరు ప్రమాదకరమైన చైనా మాంజా వాడకుండా. మామూలు మంజదారాన్ని వాడాలి అని ప్రజల కూడా కోరుకుంటూ ఉన్నారు. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి కదా!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0