ఖమ్మం: యూరియా కోసం తెల్లవారుజాము నుంచే నిరీక్షణ!
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంటలో యూరియా కొరత తీవ్రమైంది. ఎరువుల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి చూస్తున్న రైతులు. మంత్రి తుమ్మల జిల్లాలోనే ఈ ఇబ్బందులేంటని ఆగ్రహం. పూర్తి వివరాలు ఫోర్త్ లైన్ న్యూస్‌లో..
1. తెలంగాణలో మళ్లీ యూరియా కొరత.
2. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట రైతులకు కష్టం.
3. యూరియా కోసం గంటల తరబడి వేచి ఉండటం.
ఖమ్మం : మళ్లీ యూరియా కష్టాలు మొదలైనట్టు తెలుస్తుంది. బోనకల్లు మండలం ముష్టికుంట సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. యూరియా ఎరువుల కోసం మంగళవారం తెల్లవారుజామున నుంచి రైతులు లైన్లో నిలబడ్డారు. వానకాల సాగులో కీలకమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి గంటల తరబడి ఎదురుచూస్తున్నప్పటికిని కూడా ఎలాంటి ఫలితము లేకుండా పోయింది. అక్కడ ఉన్న అధికారులు నేడు సరఫరా లేదు, రేపు రావాలి అంటూ అధికారులు చెబుతున్నారు. మాటలు వింటున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
రైతులు ఇప్పటికే యూరియా లేకపోవడం వల్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వెయ్యకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదము ఉంది అని రైతులు తమ బాధను వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పటికే విత్తనాలు, సాగునీ, కూలి ఖర్చులతో అప్పుల పాలైన తమకు ఇప్పుడు ఎరువులు కొరత మరింత భారంగా ఉంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలకు ఇంత ఇబ్బంది ఉంటే గ్రామీణ ప్రాంతాల రైతులు ఇంకెందుకు ఇబ్బంది పడుతున్నారు అని ప్రజలు భావిస్తూ ఉన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలోని ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల్లో నిర్లక్ష్యమా, లేక సరైన ప్రణాళికలు లేకపోవడం ఏనా ఈ సమస్యకు కారణము అని ఆరోపిస్తున్నారు వెంటనే యూరియా సరఫరా పెంచి అన్ని సహకార సంఘాలలో ఎరువులు అందుబాటులో ఉంచాలి అని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
*రైతులు ఇప్పటికే ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు యూరియా కోసం కొత్త ఇబ్బంది పడటం చాలా బాధాకరం అంటూ ప్రజలు అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు.fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0