కుటుంబం అంతమైనా బుద్ధి మారలేదు! జైషే మహమ్మద్ మళ్లీ రగులుతోంది

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనతో జైషే మహమ్మద్ లింకులు బయటపడ్డాయి. మసూద్ అజార్ కుటుంబం అంతమైనా JeM ఉగ్రవాద ధోరణి తగ్గలేదు. పూర్తి వివరాలు Fourth Line News లో.

flnfln
Nov 12, 2025 - 17:32
 0  5
కుటుంబం అంతమైనా బుద్ధి మారలేదు! జైషే మహమ్మద్ మళ్లీ రగులుతోంది

ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం పూర్తిగా అంతమైంది. కానీ ఆ ఉగ్రవాద సంస్థ మాత్రం ఇంకా అదే మార్గంలో నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనతో జైషే మహమ్మద్ (JeM) సంబంధాలు వెలుగులోకి వచ్చాయి.

2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై బాంబు దాడులు, 2016 పఠాన్కోట్ ఎయిర్‌బేస్ దాడి, 2019 పుల్వామా ఘటనలో వందలాది మంది అమాయక పౌరులను బలితీసుకున్న జైషే మహమ్మద్ మళ్లీ తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది.

పాక్‌ ISI మద్దతుతో JeM నెట్‌వర్క్ మళ్లీ చురుకుగా మారిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మసూద్ అజార్ కుటుంబం అంతమయ్యాక నాయకత్వం వికేంద్రీకరణ జరిగినా, ఆ సంస్థ ఉగ్రవాద ధోరణి మాత్రం తగ్గలేదని భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.