నెలకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్..! గృహ జ్యోతి పథకం ఖమ్మంలో ఎలా అమలవుతోంది?
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. ఖమ్మం జిల్లాలో లబ్ధిదారులకు గ్రీటింగ్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే లాభాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
* తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకం సక్సెస్
* గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్లు ఉచితం
* గృహ జ్యోతి లబ్దదారులకు గ్రీటింగ్ కార్డులు పంపిణీ
* ఖమ్మం జిల్లా ప్రజలకు గృహ జ్యోతి పథకం వస్తుందా?
fourth line news :తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ నేపథ్యంలో అర్హులైన లబ్దదారులకు ప్రభుత్వం తరఫున గ్రీటింగ్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే లక్ష్యంగా ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా 24వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ కమర్తపు మురళి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గృహ జ్యోతి పథకం ద్వారా విద్యుత్ బిల్లలు భారం తగ్గి కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపయితాయి అని అధికారులు భావిస్తున్నారు.
కార్పొరేటర్ మురళి మాట్లాడుతూ, పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు గృహ జ్యోతి పథకం ఎంతో ఉపయోగంగా ఉంది అని వెల్లడించారు. విద్యుత్ ఖర్చులపై ఆందోళన లేకుండా గృహ అవసరతలకు విద్యుత్ వినియోగించుకునే అవకాశం ఈ పథకం కల్పిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఏఏఓ ప్రభాకర్, ఏఈ అనంత్ ప్రకాష్ తదితరులు పాల్గొని, పథకం అమలు విధానం, లబ్ధిదారుల అర్హతలు, వినియోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి పథకాలు కొనసాగించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహ జ్యోతి పథకం మీకు ఎలా అనిపించింది? ఇంకా ఎలాంటి పథకాలు తీసుకువస్తే ప్రజలు లబ్ధి పొందుతారు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0