ఖమ్మం జిల్లాలో యూరియా కొరతకు చెక్.. కలెక్టర్ అదిరిపోయే గుడ్ న్యూస్!
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. 14,388 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు పుకార్లను నమ్మవద్దని సూచించారు.
1. ఖమ్మం జిల్లాలో యూరియా కొరత ఉందా?
2. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏమన్నారు?
3. రైతులకి ఎలాంటి భరోసా ఇచ్చారు?
4. పూర్తి వివరాలు కింద ఉన్న సమాచారం ద్వారా తెలుసుకోండి;
ఖమ్మం ప్రతినిధి ; ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు అని రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 14,388 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. అలాగే యూరియా కొరత రాకుండా అవసరమైతే వినియోగానికి 4,300 మెట్రిక్ టన్నుల యూరియా చెరువుగా ఉంచామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని 82 ( pacs) కేంద్రాలు, 85 ప్రైవేట్ ఎరువుల డీలర్ల ద్వారా ప్రతిరోజు 6:00 నుంచి యూరియా రైతులకు పంపిణీ చేస్తున్నాము. వర్షాకాలంలో ఎరువుల డిమాండ్ ఎక్కువ అవసరము పడుతుంది అని రైతుబంధు పడకుండా యూరియా సరిపడా నిలువలు ఉన్నాయి అని కలెక్టర్ రైతులందరికీ భరోసా ఇచ్చారు.
రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఎక్కడ కూడా అక్రమాలు జరగకుండా అధికారులు అందరూ అన్నిటిని పర్యవేక్షిస్తున్నారు. యూరియా అక్రమ రవాణా జరిగితే ఏమాత్రం సహించుకోము కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. రైతులు కూడా అవసరానికి మించి ఎక్కువగా యూరియా కొనుగోలు చేయకుండా, వ్యవసాయ అధికారులు సూచన మేరకు మాత్రమే వినియోగించుకోవాలి అని రైతులకి సలహా ఇచ్చారు.
కొన్నిచోట్ల యూరియా కొరత ఉంది అని వార్తలు వస్తున్నానే పద్యంలో అవన్నీ అవాస్తమని జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది అని ఖమ్మం జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులేమాత్రము పుకార్లను నమ్మకుండా ఏమైనా సమస్య ఉంటే సమీప వ్యవసాయ అధికారులను అడిగి వివరంగా నిమిషాలు తెలుసుకోవాలి అని అధికారులను మీ దగ్గర ఉన్నారు కాబట్టి అలాంటి ఆందోళన చెందదు అని వెల్లడించారు. మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో ఎలాంటి యూరియా కొరతలేదు అని తెలుస్తుంది. రైతులు కూడా మీ దగ్గర ఉన్న వ్యవసాయ అధికారులతో మాట్లాడండి.
*వర్షాకాలంలో రైతులు ఎక్కువ ఇబ్బంది పడతారా?
*మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0