నాయుడుపేట బైపాస్ వద్ద విషాదం: వేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతో.......

ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పాముల కేశవులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

flnfln
Dec 22, 2025 - 19:33
 0  7
నాయుడుపేట బైపాస్ వద్ద విషాదం: వేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతో.......

1. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది 
2. బైకు పైన వెళ్తుండంగా ఎదురుంగా వచ్చిన ఆర్టీసీ బెస్ట్ 
3. పాముల కేశవులు అనే వ్యక్తి మృతి 
4. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో
5. పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు

   కింద ఉన్న సమాచారానంతటిని చదవండి అప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది
 

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;  ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాముల కేశవులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కేశవులు నాయుడుపేట బైపాస్ రోడ్డు నుంచి ఖమ్మం పట్టణం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేశవులు తీవ్ర గాయాల పాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతూ, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేదా అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

ఖమ్మంలో ఈమధ్య బైపాస్ రోడ్డు పైన ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేకమంది ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చిదు అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ ప్రమాదాలు జరగటానికి ముఖ్యమైన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే , మరియు అతివేగం కారణాలవల్ల అని అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.