ఇరాన్‌లో 31 రాష్ట్రాలకు విస్తరించిన అల్లర్లు.. 2000 మంది మృతి, ప్రపంచం ఉలిక్కిపడుతోంది!
ఇరాన్ దేశంలో రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. 31 రాష్ట్రాలకు విస్తరించిన ఈ నిరసనల్లో భద్రతా సిబ్బంది సహా 2000 మంది మృతి చెందినట్టు రైటర్స్ వెల్లడించింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రపంచం దృష్టి ఇరాన్‌పై పడింది. ఈ సంక్షోభంలో అమెరికా ఏం చేయబోతోంది?
* 31 రాష్ట్రాలు విస్తరించిన ఆందోళనలు
* ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికీ 2000 మందిని బలి తీసుకుంది
* ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వం
* అమెరికా ఏం చేయబోతుంది ఇప్పుడు,
fourth line news : ఇరాన్ దేశంలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనలో దాదాపుగా భద్రత సిబ్బందితో సహా 2000 మంది మరణించినట్టు ఇరాన్ కు చెందిన అధికారి వెల్లడించారు. ఈ సమాచారం అంతటినీ రైటర్స్ వార్త సమస్త కు తెలిపారు. ఇంతమంది మరణించడం ఇదే మొదటిసారి ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు జరగటం.
ఈ నిరసనలు డిసెంబర్ 28, 2025 తెహ్రాన్లోని గ్రాండ్ బజార్లో మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలకు విస్తరించింది. 2000 మందిలో మరణించింది భద్రత సిబ్బంది ఎంతమంది ఆ దేశ పౌరులు ఎంతమంది ఉన్నారు వివరాలు వెల్లడించలేదు. ఆర్థిక సమస్యలపై నిరసనలు చట్టబద్ధమే అని చెబుతూనే ప్రభుత్వం కఠినమైన భద్రత చర్యలు తీసుకుంటుంది. ప్రాముఖ్యంగా ఈ నిరసనలు, అల్లర్లు వెనక అమెరికా, ఇజ్రాయిల్ హస్తము ఉంది అని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
మరి ప్రాముఖ్యంగా ఇరాన్ దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో సమాచారం బయట కి రాకుండా ప్రభుత్వం చేశారు అని నిరసనకారులు వెల్లడిస్తున్నారు. కొన్ని వీడియోలు నిరసన కారుల మధ్య ఘర్షణలు, కాల్పులు ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోనికి వచ్చాయి. ఇంత ఘోరమైన దుస్థితిలో ఉన్న ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయము తీసుకుంటుందో అని ప్రపంచవ్యాప్తంగా ఆశక్తి నెలకొంది.
* ఇరాన్ ప్రజలు చేస్తున్న పోరాటం వెనుక ఉన్నది ఎవరు?
* ప్రజలే ప్రభుత్వం పాలన బాలేదని నిరసనలు చేస్తుందా?
* మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0