భారతీయులు అందరూ మోసగాళ్లే అన్న విదేశీ మేనేజర్! కోర్టు తీర్పు, మేనేజర్ షాక్ !

బ్రిటన్ KFCలో జాతి వివక్ష ఎదుర్కొన్న భారతీయ యువకుడు మాధేశ్ రవిచంద్రన్ చారిత్రాత్మక విజయం సాధించారు. మేనేజర్ అహంకారానికి చెక్ పెడుతూ కోర్టు ₹81 లక్షల పరిహారం విధించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

flnfln
Dec 29, 2025 - 09:10
 0  3
భారతీయులు అందరూ మోసగాళ్లే అన్న విదేశీ మేనేజర్!  కోర్టు తీర్పు, మేనేజర్ షాక్ !

వివక్షపై భారతీయుడి పోరాటం.. అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం

1. విదేశాల్లో ఉంటున్న భారతీయులందరికీ ఈ బాధలేనా? 
2. భారతీయులు అందరు మోసగాళ్లు అన్న మేనేజర్. 
3. కోర్టులో తేల్చుకుందాం అన్న భారతీయుడు. 
4. కోటి ఇచ్చిన తీర్పు, ప్రపంచమంతా షాక్. 
5. 81 లక్షల జరినామ ? 
6. పూర్తి సమాచారాన్ని చదవండి 

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే భారతీయులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. భాష, సంస్కృతి, వాతావరణంతో పాటు కొన్నిసార్లు జాతి వివక్ష వంటి మానసిక వేధింపులు కూడా వారి జీవితాన్ని కష్టతరం చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడి న్యాయం సాధించిన ఓ భారతీయ యువకుడి కథ ఇప్పుడు అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇలాంటి విషయాలు అందరూ తెలుసుకుంటే విదేశాల్లో ఉన్న మనవాళ్ళందరికీ ఉపయోగపడతాయి. 

తమిళనాడుకు చెందిన మాధేశ్ రవిచంద్రన్ బ్రిటన్‌లోని ఓ ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ KFC అవుట్‌లెట్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, అతడి జీవితంలో ఊహించని సమస్యలు ఎదురయ్యాయి. ఆ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న శ్రీలంక తమిళుడైన అతడి మేనేజర్ మాధేశ్‌ను తరచూ జాతి పరంగా అవమానించేవాడని కోర్టు పత్రాల్లో వెల్లడైంది. ‘బానిస’ అనే పదంతో పిలవడం, ‘భారతీయులంతా మోసగాళ్లు’ అంటూ బహిరంగంగా అవమానించడం వంటి మాటలతో అతడిని మానసికంగా వేధించేవాడని మాధేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ప్రారంభంలో ఈ మాటలను తట్టుకుని పని కొనసాగించిన మాధేశ్, రోజులు గడిచేకొద్దీ ఈ వివక్ష తీవ్రమవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. కార్యాలయంలో గౌరవం లేకుండా పని చేయలేక చివరకు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే అక్కడితో ఆగిపోకుండా, తనపై జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. బ్రిటన్‌లోని ఉపాధి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, తనకు జరిగిన జాతి వివక్షను, మానసిక వేధింపులను స్పష్టమైన ఆధారాలతో వివరించాడు.

కోర్టు విచారణలో మేనేజర్ ప్రవర్తన పూర్తిగా వివక్షపూరితమైనదిగా నిర్ధారితమైంది. ఉద్యోగ ప్రదేశంలో ఎలాంటి జాతి, దేశ ఆధారిత వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాధేశ్ ఎదుర్కొన్న మానసిక క్షోభ, ఉద్యోగం కోల్పోయిన కారణంగా ఎదురైన ఆర్థిక నష్టం అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు, బాధితుడికి సుమారు ₹81 లక్షల (బ్రిటిష్ కరెన్సీలో భారీ మొత్తం) పరిహారం చెల్లించాలని మేనేజర్‌ను ఆదేశించింది.

ఈ తీర్పు బ్రిటన్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న వలస కార్మికులకు ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు అనేక విధమైన ఇబ్బందులు పడుతూ, తక్కువ చూసి మాట్లాడే వారందరికీ  న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా విజయం లభిస్తుంది అని ఈ విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రాముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రదేశాల్లో జాతి వివక్షను ఏ మాత్రము సహించబోవు అని న్యాయవ్యవస్థను మరోసారి స్పష్టం చేసింది. 

మాధేశ్ విజయం వ్యక్తిగత గెలుపు కాకుండా,  భారతీయుల ఆత్మగౌరవానికి లభించిన ఘనవిజయము అని పలువురు అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అన్యాయాన్ని చూసి వదిలేయకుండా ధైర్యంగా పోరాడితే ఫలితం తప్పకుండా వచ్చింది అని ఈ ఘటన మనందరికీ ఒక నిర్దేశాన్ని అందించింది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు అందరూ తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి అని అధికారులు కూడా తెలియజేస్తున్నారు 


వివక్షకు వ్యతిరేకంగా మాధేశ్ సాగించిన ఈ పోరాటం, మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. 

*ఏ దేశమైనా కూడా ఇతరులను గౌరవించే ప్రేమించాలి అన్న ఆలోచన ఉండాలి. 
*ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.