ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలపై నిజం బయటపడింది: సోదరి భేటీకి అనుమతి

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న ప్రచారానికి తెరపడింది. రావల్పిండి అదియాలా జైలు అధికారులు ఖాన్ సోదరి ఉజ్మా ఖానమ్‌కు భేటీకి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామంపై పూర్తి వార్త – Fourth Line News.

flnfln
Dec 2, 2025 - 18:52
Dec 2, 2025 - 18:55
 0  3
ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలపై నిజం బయటపడింది: సోదరి భేటీకి అనుమతి

* కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ చంపబడ్డాడు అనే వార్తలు 

* ఖాన్ సోదరీమణులను కలుసుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం 

* ఈ నేపథ్యంలో సోదరీమణులు కార్యకర్తలు తీవ్ర నిరసనలు 

* అదియాల జైలు అధికారులు అనుమతి ఇచ్చారు 

* ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు. 

* పూర్తి వివరాల్లోకి వెళితే ? 

fourth line news : కొద్ది కాలంగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇమ్రాన్ ఖాన్ సోదరి మనులను కలవనివ్వడం లేదు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారు అని అనేక వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆయనతో భేటీకి సహోదరి ఉజ్మా ఖానమ్కు రావల్పిండి అదియాలా జైలు అధికారులు ఇవ్వటం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. 

ఆమె జైల్లోనికి వెళ్ళగా బయట పెద్ద సంఖ్యలో (Pakistan Tehreek-e-Insaf) కార్యకర్తలు అభిమానులు అనేకమంది వచ్చారు. కొంతకాలంగా ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబం ' ప్రూఫ్ ఆఫ్ లైఫ్' కోరుతూ పలుమార్లు డిమాండ్ చేశారు. కానీ కొన్ని రోజులుగా ఇమ్రాన్ ను కలిసేందుకు ఎవరికీ అనుమతించలేదు. ఈ సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారు అనే వార్తలు వెలుగులోనికి వచ్చాయి. 

ఇమ్రాన్ ఖాన్ను చంపేశారు అనే వార్త బయటకు రాగానే అభిమానులు బంధువులు పార్టీ కార్యకర్తలు అనేకమంది నిరసనలు తెలియజేశారు. ఖాన్ సోదరీమణులు కూడా ఆ నిరసనలో పాల్గొన్నారు. ఆయనతో భేటీకి సహోదరి అదియాల జైలు అధికారులు అనుమతించినట్టు తెలుస్తుంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు అని కార్యకర్తలు పార్టీ శ్రేణులు బంధువులు భావించారు. 

* ఇమ్రాన్ ఖాన్ గురించి ఆయన దేశాన్ని ఎలా పరిపాలించాడో వాటి గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.