iBOMMA రవికి మద్దతు: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆటో పోస్టర్
iBOMMA కేసులో అరెస్టయిన రవికి సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తోంది. ఒక ఆటోపై "తెలంగాణ రియల్ హీరో iBOMMA రవి" పోస్టర్ వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య చర్చలు ముదిరాయి.
iBOMMA వెబ్‌సైట్ వ్యవహారంలో అరెస్టయిన రవి ఇప్పుడు మరో రకంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. సినిమా పైరసీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతున్న రవికి కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే కొంతమంది మద్దతు తెలుపుతున్నారు.
తాజాగా ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై "తెలంగాణ రియల్ హీరో iBOMMA రవి" అంటూ పెద్ద పోస్టర్ అంటించాడు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో అందరికీ షేర్ అవుతుండగా, నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది.
కొంత మంది…
➡️ నేరగాళ్లకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం తప్పు అంటూ విమర్శలు చేస్తున్నారు.
మరికొందరు…
➡️ “ఎవరికి నచ్చితే వారు మద్దతిస్తారు… అది వారి వ్యక్తిగత అభిప్రాయం” అని అంటున్నారు.
ఇక మరో వర్గం మాత్రం రవి టెక్నికల్ స్కిల్స్‌ను గుర్తించి, అతడిని మంచి పనులకు ఉపయోగించేలా ప్రభుత్వం చూడాలని అంటున్నారు.
iBOMMA కేసు హాట్ టాపిక్ అవుతూనే ఉండడంతో, రవికి లభిస్తున్న ఈ అనూహ్య మద్దతు సోషల్ మీడియా చర్చలను మరింత ముదిర్చింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0