ibomma కేసులో రవి అరెస్ట్… CEOగా ప్రారంభమైన ప్రయాణం పైరసీ వరకు!
ibomma పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. CEOగా పని చేసిన రవి ఎలా పైరసీ ప్రపంచంలోకి చేరాడు? విడాకుల తర్వాత ప్రారంభమైన అక్రమ ప్రయాణం, హ్యాకింగ్ నైపుణ్యాలు, పోలీసులకు ఎలా చిక్కాడు అన్న పూర్తి వివరాలు.
తెలుగు సినిమాల పైరసీకి కేంద్రముగా నిలిచిన ibomma వెబ్‌సైట్ వెనుక ఉన్న వ్యక్తి ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసుల బారిన పడ్డాడు. ఈ అరెస్ట్‌తో అతని గతం మరోసారి వెలుగులోకి వచ్చింది.
సాంకేతిక రంగంలో మంచి స్థానానికి ఎదిగిన రవి ఒక సమయంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో CEOగా పనిచేశాడు.
అక్కడ నుంచి వ్యక్తిగత సమస్యలు మొదలయ్యాయి. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత రవి జీవితంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.
➡️ ఈ కేసు ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి అని విచారణ అధికారులు వెల్లడించారు.
కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, సర్వర్ సిస్టమ్స్‌పై రవి అభ్యాసం పెరుగుతుండగా… అతని దారి అక్రమ వైఫై, సర్వర్ లూప్‌హోల్స్, అన్‌లా ఫుల్ హ్యాకింగ్‌వైపు మళ్లింది. ఇదే నైపుణ్యాన్ని ఉపయోగించి ibomma వంటి భారీ పైరసీ ప్లాట్‌ఫారంను నడిపేందుకు అడుగు పెట్టాడని విచారణలో తేలింది.
విదేశాల్లో ఉంటూ సర్వర్లను రిమోట్‌గా నిర్వహిస్తున్న రవి, “తనను పోలీసులు పట్టుకోలేరని” నమ్మకంగా భావించే వాడు. కానీ ఇటీవలే కూకట్‌పల్లికి రావడంతో అతని కదలికలు పసిగట్టిన పోలీసులు ఝలక్ ఇచ్చి అరెస్టు చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0