హైదరాబాద్ పాతబస్తీలో విషాదం: డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో ఇద్దరు యువకుల మృతి

హైదరాబాద్ పాతబస్తీలో రెండు యువకులు డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా మృతిచెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్టలోని ఫ్లైఓవర్ కింద ఆటోలో మృతదేహాలు కనపడడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. third personతోపాటు డ్రగ్స్ తీసుకున్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. — Fourth Line News

flnfln
Dec 3, 2025 - 13:04
Dec 3, 2025 - 13:07
 0  3
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం: డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో ఇద్దరు యువకుల మృతి

* హైదరాబాద్ పాతబస్తీలో ఘోర సంఘటన చోటుచేసుకుంది

* డ్రగ్స్ హెవీడోస్ తో యువకులు మృతి 

* స్థానికులు పోలీసులకి సమాచారం 

* ఇద్దరు వ్యక్తుల ఆచూకీ మరో వ్యక్తి ఆచూకీ తెలియాలి 

* పోస్టుమార్టానికి ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు 

* డ్రగ్స్ మన ప్రాణానికి హానికరం 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

 fourth line news : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం చాంద్రాయణగుట్టలోని ప్లైఓవర్ కింద ఆగి ఉన్న ఆటోలో ఇద్దరు యువకులు వివిధ జీవులుగా కనిపించడంతో స్థానికులు కంగారుపడి పోలీసులకు సమాచారము తెలియజేశారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల సహాయముతో మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)లుగా వారిని గుర్తించారు. 

సంఘటన స్థలాన్ని పరిశీలించినప్పుడు మూడు సిరంజిలు లభ్యమయ్యాయి. అంటే యువకులు డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే చనిపోయి ఉంటారు అని భావిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ కి మూడు సిరంజీలు గుర్తించారు. దీంతో యువకులు డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే ఇద్దరితోపాటు డ్రగ్స్ తీసుకున్న మూడో వ్యక్తి ఎవరో అని పోలీసులు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మరణించిన యువకుల కు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించాము అని పోలీసులు వెల్లడించారు. 

ఈ కాలంలో యువత చాలామంది డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అది డేంజర్ అని తెలిసిన కూడా మత్తు బానిసలుగా యువత తయారవుతున్నారు. సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ అమ్మీ వారిని పట్టుకుంటున్న అమ్మకాలు ఏదో ఒక విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. డ్రగ్స్ మీ ప్రాణానికి ప్రమాదం. ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు వాటిని కొనుగోలు చేయొద్దు వాటిని అమ్మవద్దు. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.