ఆస్కార్ కల నెరవేరబోతోందా? ‘హోమ్ బౌండ్’పై జనవరి 22 ఉత్కంఠ!

ఆస్కార్ రేసులో ముందుకు దూసుకుపోతున్న భారతీయ చిత్రం ‘హోమ్ బౌండ్’. జనవరి 22న తుది నామినేషన్లు. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన ఈ సినిమా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Jan 6, 2026 - 10:46
 0  3
ఆస్కార్ కల నెరవేరబోతోందా? ‘హోమ్ బౌండ్’పై జనవరి 22 ఉత్కంఠ!

* ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న హోమ్ బౌండ్'

* అందరి దృష్టి జనవరి 22 తారీఖునే ఉంది 

* జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెర్వా ప్రధాన పాత్రల్లో నటించారు

ఫోర్త్ line news : మరో భారతీయ సినిమా ఇప్పుడు ఆస్కార్ వేదికపై సత్తా చాటుతుంది. భారతీయ చిత్రం హోమ్ బౌండ్ ఆస్కార్బరిలో మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఈ చిత్రం 89వ అకాడమీ అవార్డులలో 'ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో టాప్-15కి చేరింది. తాజాగా ఈ సినిమా నెక్స్ట్ రౌండ్ ఓటింగ్ కి అర్హత సంపాదించింది. ఇది ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఒక గర్వకారకంగా నిలవనుంది 

అయితే ఈ విభాగానికి సంబంధించిన తుది ఆస్కార్ నామినేషన్ను ఈ నెల జనవరి 22న ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్,ఇషాన్ ఖట్టర్, విశాల్ జెర్వా ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్ అధికారిగా మారాలనే కళ కలిగిన ఇద్దరు స్నేహితులు, ఈ ప్రయాణంలో ఎదురయ్యే సామాజిక, వ్యక్తిగత, సవాళ్లు చుట్టూ ఏ కదా నడిచింది. ఈ సినిమాలో ఆశలు, నిరాశలు, వ్యవస్థతో పోరాటం వంటి ఆసక్తికరమైన హృదయానికి తాకేలా దర్శకుడు తెరకెక్కించాడని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. 

హోమ్ బౌండ్' సినిమా తుది నామినేషన్ జాబితాలోకి ప్రవేశిస్తే, అది భారతీయ సినిమాకు మరో చరిత్ర ఘట్టంగా నిలుస్తుంది. ఇప్పుడు భారతదేశ సినీ వర్గాలు, అభిమానులు అంతా జనవరి 22న జరగనున్న ఆస్కారి నామినేషన్ ప్రకటనపై ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఏ సినిమా పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0