గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి.. రెడ్ జోన్‌లోకి ఢిల్లీ!
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. AQI 400 దాటడంతో ప్రభుత్వం ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సీఎం రేఖాగుప్తా ప్రజలను ప్రజా రవాణా ఉపయోగించాలని సూచించారు.
దేశ రాజధానిలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. శనివారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 పాయింట్లకు మించి నమోదైంది. కొన్నిచోట్ల ఇది 650 పాయింట్లను దాటింది. దీని వలన ఢిల్లీ "రెడ్ జోన్"లోకి చేరింది.
పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ప్రభుత్వం ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా సూచించారు. అదేవిధంగా ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్ పూలింగ్ ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్య నిపుణులు వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు బయటకు వెళ్లడం తగ్గించాలని సూచిస్తున్నారు. పాఠశాలలు, నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0