ఫలించిన తుమ్మల కృషి.. ఖమ్మంకు రూ.200 కోట్ల భారీ వరం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఖమ్మం నగరానికి రూ.200 కోట్ల తాగునీటి ప్రాజెక్టు మంజూరు. మున్నేరు, పాలేరు వనరుల నుంచి ఏడాది పొడవునా నీటి సరఫరా – ఖమ్మం అభివృద్ధికి మైలురాయి ప్రాజెక్టు.
ఖమ్మం:
ఖమ్మం నగరానికి శాశ్వత మంచినీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతర కృషి ఫలితంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే, మున్నేరు, పాలేరు వనరుల నుంచి ఏడాది పొడవునా ఖమ్మం నగరానికి నీటి సరఫరా సులభంగా జరుగుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక పైపులైన్, ఫిల్టర్ బెడ్ వ్యవస్థలు, మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నారు.
ఖమ్మం నగర అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల కృషిని నగర ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0