బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది: “చావును దగ్గరగా చూశా”
ఉత్తరప్రదేశ్ ఎటావాలో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటనలో 35 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని క్షణం తేడాతో తప్పించిన సైకిలిస్ట్ “చావు నన్నే తాకి వెళ్లింది” అంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Main points :
* దుకాణంలోనికి దూసుకు వచ్చిన బస్సు
* బస్సును చూసిన వ్యక్తి వెనక్కి జరిగి తన ప్రాణాన్ని
* 33 మంది గాయాలు.
* చావును దగ్గరగా చూసాను అని చెప్పిన వ్యక్తి
అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది అని పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ?
fourth line news : ప్రమాదం జరిగిన ప్రాంతం : ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో
పూర్తి వివరాల్లోనికి వెళ్తే : ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దుకాణంలోకి వెళ్లిపోయింది. బస్సు దుకాణంలోనికి వెళ్లిన వీడియో సిసి టీవీ రికార్డు అయింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. అయితే, బస్సు వేగంగా రావడాన్ని గమనించిన ఓ సైకిలిస్ట్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. అయితే "చావును దగ్గర నుంచి చూశాను" అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది
అయితే ఈ ప్రమాదంలో అత్యంత సంభ్రమాశ్చర్యకరమైన విషయం—ఓ సైకిలిస్ట్ క్షణాల్లో ప్రాణాలు దక్కించుకున్న విధానం. బస్సు వేగంగా అదుపుతప్పుతూ తన వైపు దూసుకువస్తున్నట్టు గమనించిన అతడు చాకచక్యంగా సైకిల్‌ను పక్కకు తిప్పి తప్పించుకున్నాడు.
అతను మీడియాతో మాట్లాడుతూ,
“చావు నా ముందు నిల్చొని చూసినట్టే అనిపించింది… క్షణం ఆలస్యమై ఉంటే నేను లేకపోయేవాణ్ని”అని చెప్పాడు.
ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. బస్సు దూసుకువచ్చిన తీరు, సైకిలిస్ట్ తప్పించుకున్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.
ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వేగం అధికంగా ఉండటం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
* మీరు కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
* బస్సు చూశారుగా ఎలా దుకాణంలోనికి వచ్చిందో. కాబట్టి ప్రయాణించేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ ప్రయాణించండి.
* ఈ ప్రమాదం వీడియో కింద ఉన్నది ఒకసారి చూడండి.
* అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
చావును దగ్గర నుంచి చూశాడు.. అదృష్టమంటే ఇతనిదేగా
ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. అయితే, బస్సు వేగంగా రావడాన్ని గమనించిన ఓ సైకిలిస్ట్ చాకచక్యంగా… pic.twitter.com/1n3ddegHmC — ChotaNews App (@ChotaNewsApp) November 24, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0