.భారత్-పాక్ అణు యుద్ధాన్ని ఆపింది నేనే: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారత్-పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వల్ల కోటి మంది ప్రాణాలు కాపాడబడ్డాయని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
1. మళ్లీ భారత పై అదే మాట అంటున్న ట్రంప్ ?
2. 10 మిలియన్ల ప్రజలను కాపాడిన.
3. ప్రపంచ స్థాయిలో 8 యుద్ధాలు ఆపా?
4. భారత్ ఎలా స్పందించబోతుంది?
5. ఈసారి యుద్ధం వస్తే పాక్ ఉంటుందా?
కింద ఉన్న సమాచారానంతటిని చదవండి అప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది ;
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్–పాకిస్తాన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరగకుండా తానే అడ్డుకున్నానని ఆయన మరోసారి ప్రకటించుకున్నారు. తన జోక్యం వల్ల దక్షిణాసియాలో భారీ విపత్తు తప్పిందని, 10 మిలియన్లకు పైగా ప్రజల ప్రాణాలు కాపాడబడ్డాయని పాకిస్తాన్ ప్రధాని తనతో చెప్పినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని ట్రంప్ వెల్లడించారు . ఆ సమయంలో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధంలో మొత్తం 8 యుద్ధ విమానాలు నేలకొరిగాయని ఆయన అన్నారు. పరిస్థితి అదుపు తప్పితే అణు స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అని ఇరుదేశాలను అడ్డుకోకపోతే నష్టం ఎక్కువగా బాటిల్లుతుంది అని వెంటనే నేను జోక్యం చేసుకున్నానని చెప్పారు
ఇదే సందర్భంలో తన రాజకీయ జీవితంలో అనేక అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించానని ట్రంప్ తెలిపారు. “నేను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపాను. కానీ పరిష్కరించలేకపోయిన ఏకైక యుద్ధం రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నదే” అని అన్నారు. ఆ యుద్ధం కొనసాగడానికి ప్రధాన కారణం రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఉన్న తీవ్రమైన వ్యక్తిగత ద్వేషమేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యలో అంతర్జాతీయ వేదికలపై తరచుగా ఏ విధమైన మాటలు మాట్లాడటం అందరిని కొంత ఆశ్చర్యపరిచాడు. ఆయన మాటలపై భారత్ పాకిస్తాన్ ఎలా స్పందిస్తాయో చూడాలి మరి. ఇప్పటికే ట్రంపు వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఎన్నో చర్చలు లేవనెత్తాయి. ఫోర్త్ లైన్ న్యూస్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0