శ్రీలంకను విరుచుకుపడుతున్న ‘దిత్వా’ తుఫాను: 56 మంది మృతి… తమిళనాడుకు ముప్పు!
శ్రీలంకను ముంచెత్తుతున్న ‘దిత్వా’ తుఫాను కారణంగా 56 మంది మృతి. వేల కుటుంబాలు నిరాశ్రయాలవగా తమిళనాడు తీరం వైపు తుఫాను దూసుకుపోతోంది. భారత్ సహాయక చర్యలకు సిద్ధం. పూర్తి వివరాలు Fourth Line News లో.
* తుఫాను ప్రభావానికి 56 మంది మృతి
* శ్రీలంకను భయపెడుతున్న దిత్వా తుఫాన్
* భారీ వర్షాలు వరదలు 56 మంది మరణాలు
* తుఫాను తమిళనాడు తీరం వైపు వెళ్తుంది
* భారత్ నౌకాదళం సహాయం చేస్తుంది శ్రీలంకకు
* అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
* పూర్తి వివరాలు
fourth line news : శ్రీలంకను విధ్వంసం చేస్తున్న దిత్వా తుఫాను. ఈ తుఫాను కారణం వల్ల బలమైన వర్షాలు బలమైన గాలులు శుక్రవారం ఉదయం నాటికి 56 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ తుఫాను తమిళనాడు తీరం వైపు వస్తుందని అంచనాలు వస్తున్నాయి.
శ్రీలంకలో భారీగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమవుతోంది. దాదాపుగా 20 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ద్వీపవ్యాప్తంగా ప్రకటించమని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. దాదాపుగా 12,000 కుటుంబాలకు చెందిన 43,00 పైగా ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు. అలాగే తూర్పు తీరంలోని అంపారా, బట్టికలోవా, ట్రింకోమలీతో పాటు సెంట్రల్ ప్రావిన్స్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన క్యాండీ, నువారా ఏలియాలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాలు నీటి మునిగాయి రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అలాగే కొండ ప్రాంతాల్లో రవాణా పూర్తిగా ఆగిపోయింది. కార్లన్ని నీటిలో కొట్టుకుపోయాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్లపైకి ఎక్కుతున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ విపత్తు కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు మరియు కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించేశారు.
శ్రీలంక అధ్యక్షుడు కుమార దిసనాయకే గురువారం అత్యవసర సమావేశం నిర్వహించి సహాయక చర్యలు పాల్గొనాలని ఎంపీలకు ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల శ్రీలంక రూపాయలు సుమారు 2.9 లక్షలు పరిహారం ప్రకటించింది. శ్రీలంక అభ్యర్థన మేరకు సహాయక చర్యలు కోసం కొలంబాలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి హెలికాప్టర్లను పంపేందుకు భారత్ అంగీకరించింది. ఈ తుఫాను వల్ల ఆ దేశమంతా విలవిలలాడుతుంది.
* భారత్ ఏ దేశానికి ఆపద వచ్చినా కూడా తనదైన సహాయము చేస్తుంది.
* ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
* fourth line news
శ్రీలంకలో భారీ వరదలకు 56 మంది మృతి
దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంకలో ఆకస్మిక వరదలు, కొండచరియలు ఏర్పడి 56 మంది మృతి చెందారు మరో 21 మంది గల్లంతు అయ్యారు.
దిత్వా తుపాను ప్రభావంతో 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతినగా, వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి.#SriLankafloods… pic.twitter.com/BEYmwSQ5tO — greatandhra (@greatandhranews) November 28, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0