ఢిల్లీ పేలుడు.. అల్ ఫలాహ్ వర్సిటీలో మరో డాక్టర్ మిస్సింగ్?
ఢిల్లీ పేలుడు ఘటనలో అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ అదృశ్యమయ్యాడు. ఉగ్రవాద అనుమానాలపై గతంలో తొలగించబడిన ఆయన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి. పూర్తి వివరాలు Fourth Line News లో.
ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి కొత్త అంశం బయటపడింది. అల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన డాక్టర్ నిసార్ ఉల్ హసన్ పేలుడు తర్వాత అదృశ్యమైనట్లు సమాచారం. భద్రతా సంస్థలు ఇప్పుడు అతని కదలికలపై నిఘా వేసినట్లు తెలుస్తోంది.
నిసార్ గతంలో కశ్మీర్‌లోని SMHS ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. అయితే ఉగ్రవాద సంబంధాలపై అనుమానాల కారణంగా, 2023లో జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అతన్ని పదవి నుంచి తొలగించారు. ఆ సమయంలో అతడిపై కేసు కూడా నమోదైంది.
తర్వాత ఆయన అల్ ఫలాహ్ వర్సిటీలో చేరి పని ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీ పేలుడు ఘటనతో మళ్లీ అతని పేరు చర్చనీయాంశంగా మారింది. భద్రతా అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0