దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను దారుణంగా చంపేసిన కోడలు
విశాఖ పెందుర్తిలో దొంగ-పోలీస్ ఆట పేరుతో కోడలు అత్తను దారుణంగా చంపేసిన ఘటన సంచలనం రేపింది. హత్యా నాటకం విచారణలో బట్టబయలైంది – Fourth Line News.
విశాఖలో షాక్ ఇచ్చిన కోడలు హత్య
విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. దొంగ-పోలీస్ ఆట పేరుతో కోడలు తన అత్తను చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారం మేరకు, మహాలక్ష్మీ (63), ఆమె కోడలు లలిత మధ్య కొంతకాలంగా గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లలిత తన అత్తపై పగ పెంచుకుని, ఆట పేరుతో చంపేసింది.
దొంగ-పోలీస్ ఆడుదామని చెప్పి మహాలక్ష్మీ కళ్లకు గంతలు కట్టి, చేతులు, కాళ్లు బంధించింది. ఆ తరువాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ప్రారంభంలో దీపం అంటుకొని చనిపోయిందని పోలీసులకు సమాచారం ఇచ్చిన లలిత, విచారణలో తన హత్యా నాటకం బయటపడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0